E-Paper
Advertisement

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!
Advertisement

Sanjana Anne: మోడల్ గా తమ కెరియర్ ను మొదలుపెట్టి.. ఆ తర్వాత నటిగా అరంగేట్రం చేసిన ఎంతోమంది సెలబ్రిటీలను చూసాం.. కానీ బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలు కూడా మోడల్స్ కి వేదికగా నిలుస్తున్నాయి అనడంలో సందేహం లేదు . అలా సామాన్యులకు కూడా బిగ్ బాస్ వేదికగా మారి వారికి ఊహించని పాపులారిటీ అందిస్తోంది. అలా బిగ్ బాస్ సీజన్ 2 లో కామన్ మ్యాన్ కేటగిరీలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది సంజన అన్నే (sanjana anne). అయితే హౌస్ లో ఉన్నది వారం రోజులే అయినా తనదైన మాట తీరుతో, గొడవలతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది సంజన.

బేబీ బంప్ ఫోటోలతో ఆకట్టుకున్న సంజన..

బిగ్ బాస్ సీజన్ 2 లోకి అడుగు పెట్టకు ముందు ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే చిత్రంలో కీలకపాత్ర పోషించింది. బిగ్ బాస్ 2 తర్వాత మళ్లీ ఎక్కడ ఈమె కనిపించలేదు. కానీ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిన్నది.. తాజాగా బేబీ బంప్ తో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది.. ఈ మేరకు తన సీమంత వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇందులో నిండు గర్భంతో చాలా చూడముచ్చటగా కనిపించింది సంజన. పైగా తన భర్తతో కలిసి దిగిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, పండంటి బిడ్డకు, ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మని ఇవ్వాలని అభిమానులు, నెటిజన్స్ ఆకాంక్షిస్తూ సేఫ్ డెలివరీ అంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం సంజన బేబీ బంప్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేను- సంజన.

Advertisement

ఇకపోతే నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసి వారానికే బయటకు వచ్చి.. స్టేజ్ పై తాను చేసిన అతి పెద్ద తప్పు గురించి బయట పెట్టింది. “నన్ను మా నాన్న ఒక అబ్బాయిలా పెంచారు. కానీ నేను మోడలింగ్ లోకి రావడం ఆయనకు ఇష్టం లేదు. ఈ విషయంలో మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో నా ఫ్రెండ్స్ చేత నేను ఫేస్బుక్లో “రిప్” అని పెట్టించాను. నేను చేసిన ఈ తప్పు వల్ల మా నాన్నకు గుండెపోటు వచ్చింది. చాలా రోజులు హాస్పిటల్ లోనే ఉన్నారు. నేను చేసిన తప్పుకి ఇప్పటికీ బాధపడుతున్నాను” అంటూ గతంలో తాను చేసిన తప్పు గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది సంజన.

ALSO READ: విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే జైలు జీవితం..

Advertisement

బిగ్ బాస్ సీజన్ 2 లో సామాన్యురాలుగా అడుగుపెట్టిన ఈమె హౌస్ లోకి అడుగుపెట్టడంతోనే జైలు జీవితం గడిపింది. అప్పుడే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత ప్రతిరోజు విసుర్లు, అరవడం మామూలు అయిపోయాయి. అలా భారీ పాపులారిటీ సంపాదించుకోవాల్సిన ఈమె తొలివారమే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచింది.

.

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×