E-Paper
Advertisement

ఫౌజీ అసలు వస్తుందా? ప్రభాస్ సినిమా చుట్టూ పెరుగుతున్న సస్పెన్స్!

ఫౌజీ అసలు వస్తుందా? ప్రభాస్ సినిమా చుట్టూ పెరుగుతున్న సస్పెన్స్!
Advertisement

Fauji Release Date:ఫౌజీ…సీతా రామం వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలోవస్తున్నసినిమా . మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా వస్తున్నఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. పాకిస్తాన్ బ్యూటీ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ 3న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా.

దీంతో ఆ వారంలో వచ్చేందుకు చాలా సినిమాలు వెనకడుగు వేశాయి.ఇక గ్రౌండ్ ఖాళీగా ఉండటంతో డార్లింగ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడని మురిసిపోయారు రెబల్ ఫ్యాన్స్.అయితే తాజాగా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలని చూస్తుంటే ఫౌజీ చెప్పిన సమయానికి వస్తుందా అన్న అనుమానాలు మొదలవుతున్నాయి.

వృషకర్మ వచ్చేందుకు రెడీ

Advertisement

ఎందుకంటే తాజాగా డిసెంబర్ వారంలో పలు ప్రామిసింగ్ సినిమాలు వచ్చేందుకు రెడీ అవడమే. అవును…డిసెంబర్ ఫస్ట్ వీక్ లో నాగ చైతన్య , కార్తీక్ వర్మ దండు కాంబోలో వస్తున్న వృషకర్మ వచ్చేందుకు రెడీ అవుతుందన్న టాక్ వినిపిస్తుంది.విరూపాక్ష వంటి సినిమాతో థ్రిల్లింగ్ హిట్ కొట్టిన కార్తీక్ వర్మ,తండెల్ వంటి సూపర్ హిట్ కొట్టిన చైతు కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

దుల్కర్ సల్మాన్ శ్రీ శ్రీ కూడా

ఇక ఇదే వారంలో దుల్కర్ సల్మాన్ శ్రీ శ్రీ కూడా వచ్చేందుకు రెడీ అవుతుందన్న టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో తెలుగు నాట మంచి మార్కెట్ సెట్ చేసుకున్న దుల్కర్ నుండి వస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలే ఉన్నాయి.

విశ్వక్సేన్ నటిస్తున్న లెగసీ కూడా

Advertisement

ఇక వీటితో పాటు సాయి కిరణ్ దర్శకత్వంలో విశ్వక్సేన్ నటిస్తున్న లెగసీ కూడా అదే వారంపై ఫోకస్ పెట్టడం గమనార్హం. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్ప్ చూస్తుంటే యూత్ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో టార్గెట్ చేశారో అర్థమవుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేని విశ్వక్ సేన్ కి ఈ సినిమా డూ ఆర్ డై లాంటిందే.

డిసెంబర్ మొదటి వారంపై ఫోకస్

నిజానికి ఫౌజీ సినిమా వస్తే మాత్రం ఇవి మరో వారానికి వెళ్ళడం పక్కా.కాని డేర్ చేసి డిసెంబర్ మొదటి వారంపై ఈ సినిమాలన్నీ ఫోకస్ చేస్తున్నాయన్న టాక్ చూస్తుంటే ఫౌజీ సైలెంట్ గా డేట్ ఏమైనా మార్చుకుంటున్నాడా అన్న అనుమానాలు మొదలవుతున్నాయి.

ALSO READ:బిగ్ బాస్ 10లో ఎవరు ఎంత తీసుకుంటున్నారు? లెక్కలు బయటికి!

కొంపదీసి పొంగల్ బరిలోకి?

చూడాలి మరి ఇప్పటికైనా ట్రేడ్ వర్గాల్లో పెరిగిపోతున్న అనుమానాలకి ఫౌజీ మేకర్స్ ఏమైనా అడ్డుకట్ట వేసి  మరోసారి అదే డేట్ ని  అఫీషియల్ గా  అనౌన్స్ చేస్తారా లేక అబ్బే ఆ తేదీకి రాలేమని కొంపదీసి పొంగల్ బరిలోకి దూరిపోతారా ?

Tags

Related News

ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు..మనసులు గెలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!

మనవడి కోసం నాగబాబు సంచలన నిర్ణయం!

అప్పుడే ఏడాది..క్యూట్ పిక్ తో కొడుకుకి స్పెషల్ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్ !

ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ పిలుపు!

నిఖిల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘స్వయంబు’ రిలీజ్ అప్పడే..?

‘సర్దార్ 2’ ట్విట్టర్ రివ్యూ.. కార్తీ అకౌంట్లో హిట్ పడిందా..?

ఇరుముడి ఊచకోత.. ఇప్పటివరకు వచ్చింది ఎంతో తెలుసా ?

Big Stories

Advertisement
×