మాత్రలను వేసుకోవడం కొందరికి పెద్ద టాస్క్. వాటిని నోట్లో పెట్టుకోడానికి ముందే దోకు వచ్చేస్తున్నట్లు ఫీలవుతారు. కొందరైతే.. ఇందుకు భిన్నం.. పిప్పర్‌మెంట్ల తరహాలో నోట్లో వేసుకుని మింగేస్తుంటారు. మాత్రలను మింగే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. కొందరు నీళ్లు నోట్లో పెట్టుకుని.. మాత్రను వేసుకుని.. నీటితోపాటు మింగేస్తారు. దీనివల్ల చాలా సాఫీగా మాత్ర గొంతులోకి దిగిపోతుంది. మరికొందరైతే.. ముందు మాత్రను నోటిలో పెట్టుకుని తర్వాత నీళ్లు తాగి మింగేస్తారు. దీనివల్ల కూడా మాత్ర సాఫీగా గొంతులోకి వెళ్లిపోతుంది. మరి, రెండు విధానాల్లో ఏది బెటర్?
మాత్రలను మిగడం ఇష్టం లేక నిర్లక్ష్యం చేస్తారు. దానివల్ల ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది. కష్టమైనా.. ఇబ్బందిగా ఉన్నా వాటిని తీసుకోవల్సిందే. చాలా మందికి ట్యాబ్లెట్ ఎలా వేసుకోవాలనే దానిపై సందేహాలు ఉంటాయి. నీళ్లు ముందు తాగాలా? ట్యాబ్లెట్ వేసుకుని తాగాలా? లేదా నీళ్లు లేకుండా వేసుకోవచ్చా? వంటి విషయాలపై స్పష్టమైన అవగాహన ఉండటం చాలా అవసరం.
ట్యాబ్లెట్ (మాత్రలు) లేదా క్యాప్సూల్ లేదా పిల్స్ వేసుకునేటప్పుడు ముందుగా నోటిలో ట్యాబ్లెట్ పెట్టుకోవాలి. ఆ వెంటనే ఒక పూర్తి గ్లాసు మంచి నీళ్లు తాగాలి. అప్పుడు మాత్ర నీటితోపాటు గొంతులోకి జారుతుంది. కొందరు ముందుగా నీళ్లు నోట్లో పోసుకుని తర్వాత ట్యాబ్లెట్ వేస్తుంటారు. అయితే ఇలా చేయడం కంటే, ట్యాబ్లెట్ నాలుక మీద ఉంచి నీళ్లు తాగితే అది గొంతులోకి సులభంగా జారుతుంది. ట్యాబ్లెట్ గొంతులో అతుక్కుపోయే ప్రమాదం ఉండదు.
మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు లేకుండా ట్యాబ్లెట్ మింగకూడదు. నీళ్లు లేకుండా మిగింతే ఆ మాత్ర గొంతులో అన్నవాహికలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల అన్నవాహిక గోడలపై తీవ్రమైన మంట, చికాకు ఏర్పడుతుంది. ట్యాబ్లెట్ వల్ల ఏమైనా గాయలైతే అక్కడ పూతలు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని రకాల యాంటీబియోటిక్స్, పెయిన్ కిల్లర్లను నీళ్లు లేకుండా మింగకూడదు. అలా చేస్తే అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ట్యాబ్లెట్లతోపాటు సుమారు 200 నుంచి 250 మిల్లీ లీటర్ల నీళ్లు తాగాలి. అంటే ఒక గ్లాసుకు మించి నీళ్లు తాగకూడదు. అంతకంటే ఎక్కువ నీరు తాగితే మాత్ర ప్రభావం తగ్గుతుంది.
కొంతమంది ట్యాబ్లెట్లను కసకసా నమిలి తినేస్తుంటారు. దాన్ని వాళ్లు చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ, అలా అస్సలు చేయకూడదు. చాలా మందుల్లో ‘ఎంటెరిక్ కోటెడ్’ (enteric-coated) లేదా ‘సస్టెయిన్డ్ రిలీజ్’ (sustained-release) రకానికి చెందిన పూతలతో వస్తాయి. ఇవి కడుపులో ఉండే యాసిడ్స్ నుంచి మాత్రను రక్షిస్తాయి. శరీరం వాటిని శోషించుకొనే వేగాన్ని నియంత్రింస్తాయి. ఇలాంటి మాత్రలను నమిలితే ఆ పూత దెబ్బతిని ట్యాబ్లెట్ ప్రభావం తగ్గిపోతుంది. కేవలం చప్పరించి తినే ట్యాబ్లెట్లను మాత్రమే అలా తీసుకోవాలి.
Also Read: దాని ‘సైజ్’ పెంచుకోడానికి ఇన్‌ఫ్లుయెన్సర్ అత్యాశ.. సర్జరీ సక్సెస్, కానీ..
మాత్రలను గోరువెచ్చని నీళ్లు లేదా సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీళ్లతో తాగడం ఉత్తమం. చల్లని మజ్జిగ, కూల్ డ్రింక్స్, సోడాలు, టీ, కాఫీ లేదా పండ్ల రసాలతో మింగకూడదు. ఇవి మందులోని రసాయనాలతో ప్రతిచర్య జరిపి వాటి ప్రభావాన్ని తగ్గిస్తాయి. డాక్టర్లు సూచించిన విధంగా మాత్రలను ఖాళీ కడుపుతో లేదా భోజనానికి ముందు వేసుకోవాలి. ఎక్కువ గ్యాప్ ఇస్తే కడుపులో మంట రావచ్చు. కొన్ని మాత్రలను డాక్టర్ సూచించినట్లుగా భోజనం తర్వాత తీసుకోవల్సి ఉంటుంది. అలాగే కొన్ని రకాల బీపీ, కాల్సియం మాత్రలను నిద్రకు ముందు వేసుకోవాలని సూచిస్తారు. ఈ మాత్రలను వేసుకున్న వెంటనే నిద్రపోకూడదు. కనీసం ఐదు నిమిషాలు నిటారుగా కూర్చోవాలి. దీనివల్ల మాత్ర అన్నవాహిక నుంచి కడుపులోకి సులభంగా జారుతుంది.
Medical Disclaimer: This content is for informational and educational purposes only and should not be considered professional medical advice, diagnosis, or treatment. Always consult a qualified healthcare provider or your doctor regarding any questions or concerns you may have about taking medications, prescribed dosages, or existing medical conditions. Never disregard professional medical advice or delay seeking it because of something you have read here.