E-Paper
Advertisement

MSVPG Pre release: ఈ సంక్రాంతి తెలుగు చిత్ర పరిశ్రమదవ్వాలి.. చిరంజీవి స్పీచ్ వైరల్!

MSVPG Pre release: ఈ సంక్రాంతి తెలుగు చిత్ర పరిశ్రమదవ్వాలి.. చిరంజీవి స్పీచ్ వైరల్!
Advertisement

MSVPG Pre release: మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈయన తన స్పీచ్ ద్వారా అందరిని ఆకట్టుకున్నారు. ఈ సంక్రాంతి పండుగకు విడుదలవుతున్న సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని పేరుపేరునా ప్రతి ఒక్క హీరో, వారి సినిమా పేర్లను తెలియజేస్తూ చిరంజీవి ఈ సందర్భంగా తెలియజేశారు . ఈ సంక్రాంతి కేవలం మన శంకర్ వరప్రసాద్ గారిది మాత్రమే కాదని , ఈ సంక్రాంతి చిత్ర పరిశ్రమది అవ్వాలి అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు..

ఇక అనిల్ రావిపూడి గురించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. అనిల్ రావిపూడి నాకు కథ నేరేట్ చేస్తూ మీరు ఒకప్పుడు నటించిన చంటబ్బాయి తరహాలో సినిమా కావాలని కోరుకున్నారు ఆయన చాలా అద్భుతంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని, కచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారని చిరంజీవి వెల్లడించారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఉన్నన్ని రోజులు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ పూర్తి చేసామని తెలిపారు. తాము సినిమా షూటింగ్ కి వచ్చామనే భావన లేకుండా అనిల్ రావిపూడి అక్కడి వాతావరణాన్ని సృష్టించేవారని సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఏదో తెలియని బాధ, ఎమోషన్ మమ్మల్ని వెంటాడిందని చిరంజీవి తెలిపారు.

నా వెనుక ఉండి ముందుకు నడిపిస్తోంది..

Advertisement

ఇక వెంకటేష్ తో కలిసి నటించడం గురించి కూడా చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడారు గతంలో తామిద్దరం కలిసి ఒక ఇంటికి వెళ్లినప్పుడు ఒక ఫోటో దిగాము. ఈ ఫోటో మన ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమాకు నాంది పలకాలి అని అప్పుడు అనుకున్నాము అది ఇప్పుడు నెరవేరిందని చిరంజీవి తెలిపారు. ఇక నిర్మాతల గురించి కూడా ఎంతో గొప్పగా మాట్లాడారు ఈ సినిమాకు చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సుస్మిత గురించి మాట్లాడుతూ.. నాకు మరో కొడుకు లాంటిదని చిరంజీవి తెలియజేశారు. నా ఇంటి పెద్ద కూతురుగా చిన్నప్పటినుంచి ఎన్నో బాధ్యతలు తీసుకున్న సుస్మిత ఇప్పటికీ నా బాధ్యతలను తీసుకొని నా వెనుక ఉండి నన్ను ముందుకు నడిపిస్తుందని తెలిపారు.

సుస్మిత కొడుకుతో సమానం..

Advertisement

రామ్ చరణ్ లాగే నాకు సుస్మిత మరొక కొడుకుతో సమానమని ఈ సందర్భంగా తెలియజేశారు. సుస్మితకు ఇండస్ట్రీలోకి వచ్చి ఈ స్థాయిలో కష్టపడాల్సిన అవసరం లేదు కానీ తన కష్టాన్ని నమ్ముకుని జీవితంలో ముందుకు సాగుతోందని తెలిపారు. తన కష్టానికి తగ్గం ప్రతిఫలం దక్కాలని కోరుకున్నారు. ఇక ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్లకు ఇతర నటినటులకు ఈ సందర్భంగా చిరంజీవి ధన్యవాదాలు తెలియజేశారు.ఇక ఈ సినిమా నుంచి ప్రీ రిలీజ్ వేడుకలో విడుదల చేసిన హుక్ స్టెప్స్ సాంగ్ చాలా బాగా వచ్చిందని కచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్లో ఈ పాటను ఎంజాయ్ చేస్తారంటూ చిరంజీవి తెలియజేశారు.

Also Read; MSVPG Pre release: అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు అన్నయ్య.. సౌండ్ అదిరిపోవాలంతే!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×