E-Paper
Advertisement

Hidma Encounter: హిడ్మా ఎన్ కౌంటర్ భూటకపు హత్య.. పట్టించింది ఆ ద్రోహులే.. మావోయిస్టుల సంచలన లేఖ

Hidma Encounter: హిడ్మా ఎన్ కౌంటర్ భూటకపు హత్య.. పట్టించింది ఆ ద్రోహులే.. మావోయిస్టుల సంచలన లేఖ
Advertisement

Hidma Encounter: మావోయిస్టు హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ విడుదల చేశారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, సివిల్ కాంట్రాక్టర్ కుట్రతోనే హిడ్మా అరెస్ట్ అయినట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి వికల్ప్ లేఖలో పేర్కొన్నారు. హిడ్మాను అరెస్ట్ చేసి మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్లి కాల్చి చంపారని వికల్ప్ ఆరోపించారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, అల్లూరి జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్ కుట్రతోనే హిడ్మా పట్టుబడ్డారని లేఖలో ఆరోపించారు. మారేడుమిల్లిలో జరిగింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు చేసింది కాదన్నారు.

మాజీ మావోయిస్టు పాత్ర

ఇటీవల తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన మాజీ మావోయిస్టు కోసాల్ కూడా పోలీసులకు హిడ్మా సమాచారం అందించారన్నారు. చికిత్స కోసం హిడ్మా అడవి నుంచి బయటకు వచ్చారన్న విషయం కోసాల్‌కు తెలుసన్నారు. కోసాల్ లొంగిపోయిన విషయం తెలిసి హిడ్మాను అడవిలోకి రావాలంటూ సమాచారం ఇచ్చామని వికల్ప్‌ లేఖలో పేర్కొన్నారు. హిడ్మా తన టీమ్‌తో అడవిలోకి రావడానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో కాంట్రాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు.

Advertisement

Also Read: AP Politics: ఇలాగైతే నక్సలైట్లు పుట్టుకొస్తారు.. చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ వార్నింగ్

సమగ్ర దర్యాప్తునకు డిమాండ్

హిడ్మా ఎన్కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట ఈ లేఖ విడుదలైంది. హిడ్మా, శంకర్లను ఎన్కౌంటర్ చేయలేదని, ఇది పూర్తిగా భూటకపు హత్య అని ఆరోపించారు. అరెస్టు చేసి వారం రోజులు చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆరోపించారు. ఏపీకి చెందిన కలప వ్యాపారుల ద్రోహంతో హిడ్మా పట్టుబడ్డారన్నారు. చికిత్స కోసం విజయవాడ వచ్చిన హిడ్మా, శంకర్ ను
తిరిగి అడవిలోకి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. హిడ్మా సమాచారం పోలీసులకు అందించింది మాజీ మావోయిస్టు కోసాల్ అని లేఖలో మావోయిస్టులు ఆరోపించారు. ఆంధ్ర పోలీసులు కస్టడీలోనే హిడ్మాను హతమార్చారని ఆరోపించారు. హిడ్మా, శంకర్ ఎన్ కౌంటర్ పై సమగ్ర దర్యాప్తు చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×