E-Paper
Advertisement

Chikiri Song Promo : మొత్తానికి ‘చిక్రి’ అంటే ఏంటో చెప్పేసిన బుచ్చిబాబు

Chikiri Song Promo : మొత్తానికి ‘చిక్రి’ అంటే ఏంటో చెప్పేసిన బుచ్చిబాబు
Advertisement

Chikiri Song Promo :గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న రామ్ చరణ్ (Ram Charan) ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత శంకర్ (Shankar S) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేసి భారీ డిజాస్టర్ ను మూట కట్టుకున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న రామ్ చరణ్.. అందులో భాగంగానే ‘ఉప్పెన’ సినిమాతో స్టార్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్న బుచ్చిబాబు సనా(Bucchibabu sana) దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

పెద్ది మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్..

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. ఇందులో రామ్ చరణ్ కి సంబంధించిన లుక్స్ తో పాటు సినిమా లొకేషన్స్ కి సంబంధించిన ఫోటోలను అప్పుడప్పుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. అది కూడా ప్రేక్షకులలో అంచనాలు పెంచేసింది. ఇప్పుడు భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రం నుండి తాజాగా ఫస్ట్ పాటకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. చికిరి అంటూ సాగే ఈ ప్రోమో పాటపై అంచనాలు పెంచేసింది ఇకపోతే ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతాన్ని అందిస్తూ ఉండగా.. జాన్వీ కపూర్ (Janhvi kapoor) హీరోయిన్గా నటిస్తోంది.

Advertisement

ALSO READ:Kiran Abbavaram : కె ర్యాంప్ మూవీకి లీగల్ చిక్కులు… దాన్ని కూడా వాడేస్తున్నారా?  

చికిరి అర్థం ఏంటో చెప్పిన బుచ్చిబాబు..

తాజాగా బుచ్చిబాబు సనా.. ఏ ఆర్ రెహమాన్ ను ఈ పాట కంపోజ్ చేయమని అడుగుతూ.. ఒక వీడియో షూట్ చేశారు. దానిని రిలీజ్ చేస్తూ చికిరి అర్థం ఏంటో చెప్పేశారు. స్పెషల్ గా షూట్ చేసిన వీడియోలో బుచ్చిబాబు మాట్లాడుతూ.. కొండల్లో ఉంటున్న హీరో రామ్ చరణ్ మొదటి సారి హీరోయిన్ జాన్వీని చూసినప్పుడు వచ్చే పాటే ఈ చికిరి.. ఈ పాటకు బాణీ ఇవ్వాలి అని రెహమాన్ కు సందర్భాన్ని వివరిస్తూ చికిరి అర్థం చెబుతాడు బుచ్చిబాబు. దీంతో చికిరి అంటే ఏంటి అని రెహమాన్ ఆసక్తిగా అడగగా.. మా ఊర్లో ఆడపిల్లలను ముద్దుగా చికిరి అని పిలుస్తారు దీనిపైన పాట కంపోజ్ చేయండి అని అడగగానే.. వెంటనే ఏఆర్ రెహమాన్ చికిరి చికిరి అంటూ ఈ పాటను కంపోజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. ఇందులో హుక్ స్టెప్ కూడా వైరల్ గా మారింది. ఇకపోతే నవంబర్ 7వ తేదీన ఫుల్ పాటను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

Advertisement

 

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×