BigTV English
Advertisement

Kiran Abbavaram : కె ర్యాంప్ మూవీకి లీగల్ చిక్కులు… దాన్ని కూడా వాడేస్తున్నారా?

Kiran Abbavaram : కె ర్యాంప్ మూవీకి లీగల్ చిక్కులు… దాన్ని కూడా వాడేస్తున్నారా?

Kiran Abbavaram : ఈ మధ్యకాలంలో సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి చిత్ర బృందం ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ తమ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్తున్నారు. ఇకపోతే అందులో ఈ ప్రమోషనల్ కార్యక్రమాల వల్ల కొంతమేర సక్సెస్ అయితే.. మరి కొంతమంది ఇబ్బందుల్లో పడుతున్నారని చెప్పవచ్చు. మరొకవైపు తమ సినిమాలలో వేరే సినిమాలకు సంబంధించిన సన్నివేశాలను, పాటలను అనుమతి లేకుండా ఉపయోగించుకోవడం కూడా ఇప్పుడు వ్యతిరేకతకు దారితీస్తోంది. అయితే కావాలనే.. ఈ వ్యతిరేకత ఏర్పడాలని కొంతమంది చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చిత్రానికి లీగల్ నోటీసులు ఇస్తామని సదరు చిత్ర నిర్మాతలు హెచ్చరించినట్లు సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


కే ర్యాంప్ మూవీకి లీగల్ నోటీసులు..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కే ర్యాంప్ సినిమాలో ఆయుధం సినిమాలోని “ఇదేమిటమ్మా మాయ మాయ” అనే పాటను ఉపయోగించిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఈ చిత్ర నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తమ పరిమిషన్ లేకుండా కనీసం మర్యాదపూర్వకంగా కూడా సంప్రదించకుండా మా సినిమాలోని పాటను కే ర్యాంప్ చిత్రంలో ఉపయోగించినందుకు.. కే- ర్యాంప్ నిర్మాతలకు, ఓటీటీ , సాటిలైట్ సంస్థలకు లీగల్ నోటీసులు పంపి, వారిపై చర్యలు తీసుకుంటామని ఆయుధం సినిమా నిర్మాతలు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది ఒక ప్రమోషన్ స్టంట్ అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఇలా కూడా వాడుకుంటారా..?

విషయంలోకి వెళ్తే.. కావాలనే చిత్ర బృందం ఇలా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల సదరు చిత్రానికి సంబంధించిన నిర్మాతలు లేదా హీరోలు ఎవరో ఒకరు స్పందిస్తారని.. అలా స్పందించడం వల్ల సినిమాకు పబ్లిసిటీ పెరుగుతుందని.. ఈ కారణంగానే కిరణ్ అబ్బవరం ప్రమోషనల్ స్టంట్ కి తెర లేపారు అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే కిరణ్ అబ్బవరం టాలెంట్ మరో లెవెల్ లో ఉంది.. అయినా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా కూడా వాడుకుంటారా? అంటూ ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి దీనిపై చిత్ర బృందం ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.


ALSO READ:Dharma Mahesh: పోలీసులను ఆశ్రయించిన ధర్మా మహేష్.. భార్య గౌతమీతో పాటు అతనిపై ఫిర్యాదు!

కే ర్యాంప్ సినిమా విశేషాలు..

కిరణ్ అబ్బవరం హీరోగా, యుక్తి తరేజ హీరోయిన్గా సాయికుమార్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కే ర్యాంప్. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మక్ నిర్మించారు. జైన్స్ నాని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాపై మొదట్లో కొంత వ్యతిరేకత ఏర్పడినప్పటికీ.. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Related News

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Salman Khan: సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు.. ఎప్పుడూ డబ్బేనా.. ప్రాణాలతో పనిలేదా?

NTR: ఎన్టీఆర్ లుక్స్.. భయపడుతున్న ఫ్యాన్స్.. నీల్ మావా నువ్వే కాపాడాలి

Chikiri Song Promo : మొత్తానికి ‘చిక్రి’ అంటే ఏంటో చెప్పేసిన బుచ్చిబాబు

Dharma Mahesh: పోలీసులను ఆశ్రయించిన ధర్మా మహేష్.. భార్య గౌతమీతో పాటు అతనిపై ఫిర్యాదు!

Bahubali: The Eternal War: బాహుబలి మరణం.. ముగింపు కాదు!

Big Stories

×