Bidar Road Incident: ఆలయ దర్శనానికి వెళ్లి.. నలుగురు వ్యక్తులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. సంగారెడ్డి జిల్లా జగన్నాథ్ పూర్ గ్రామానికి చెందిన ఐదుగురు.. కర్ణాటక గంగాన్పూర్ దేవాలయానికి దర్శనానికి వెళ్లారు. అనంతరం తిరిగి కార్‌లో వస్తుండగా హుమనాబాద్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో కారు నుజ్జునుజ్జు అవ్వగా.. నలుగురు మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. పరిస్థితి విషమంగా ఉండటంతో.. బీదర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పూర్తి సమాచారం.. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. బీదర్ జిల్లా హల్లిక్హెడ్ ప్రాంతంలో, బాల్కి తాలూకా నీలమనెల్లి తండా సమీపంలో ఒక కారు, డీటీడీసీ కొరియర్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ తల్లుకొట్టుకోవడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది, ప్రయాణికులు లోపల చిక్కుకున్నారు.
ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతులు నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60). వీరంతా గణుగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి దైవ దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గణుగాపూర్ ఆలయం హిందూ భక్తులకు ప్రసిద్ధ క్షేత్రం, దత్తాత్రేయ స్వామి దర్శనం కోసం ఎంతో మంది తెలంగాణ నుంచి వెళ్తూ తిరిగి వస్తారు. వీరు కూడా భక్తి భావంతో ఆలయాన్ని సందర్శించి, సుఖంగా తిరిగి రావడానికి ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఊహించని విధంగా రోడ్డు ప్రమాదం వారి జీవితాలను ముగించింది.
Also Read: దారుణం.. పరీక్షల్లో ఫెయిలయ్యానని హీలియం గ్యాస్ పీల్చి వ్యక్తి ఆత్మహత్య..
ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సహాయంతో గాయపడినవారిని బీదర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి మార్చారు. అలాగే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. డీటీడీసీ వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, రెండు వాహనాలు అధిక వేగంతో వెళ్తుండటమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి
బీదర్ జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం
ఎదురెదురుగా ఢీకొన్న కారు, డీటీడీసీ వాహనం
ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
గానుగాపూర్ ఆలయ సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన pic.twitter.com/lxtp1nyIMg
— BIG TV Breaking News (@bigtvtelugu) November 5, 2025