BigTV English
Advertisement

Bigg Boss: బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవ.. ఇదేం దరిద్రం రా నాయనా..

Bigg Boss: బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవ.. ఇదేం దరిద్రం రా నాయనా..

Bigg Boss: ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నా రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులో మాత్రమే కాదు మిగిలిన అన్ని ఇండస్ట్రీలలో కూడా ఈ షో ప్రసారం అవుతుంది. అయితే తెలుగులో తొమ్మిదవ సీజన్ ప్రసారం అవుతుంటే మిగిలిన ఇండస్ట్రీలలో ఎక్కువ సీజన్లను పూర్తి చేసుకుంది.. కన్నడ, తమిళ, హిందీ, తెలుగులో బిగ్ బాస్ ప్రసారమవుతుంది. మొన్నటి వరకేమో కన్నడ బిగ్ బాస్ పై పోలీస్ కేసు లాంటివి వినిపించాయి. అలాగే హిందీ బిగ్ బాస్ లో రొమాంటిక్ సీన్లు ఎక్కువవుతున్నాయి అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళ బిగ్ బాస్ లో ఏకంగా గొడవకి కాలు రువ్వారు కంటెస్టెంట్స్. నిన్నటి ఎపిసోడ్ కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన అభిమానులు షాకింగ్ కామెంట్స్ చెయ్యడంతో పాటుగా ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు…


కమరుద్దీన్, ప్రవీణ్ రాజ్ మధ్య గొడవ..

రియాల్టీ షో గా ప్రారంభమవుతున్న బిగ్ బాస్ లో రాను రాను టాస్కులలో గొడవలు పెరుగుతున్నాయి. అంతే కాదు ఒకవైపు విమర్శలు కూడా రావడంతో షో కి నానాటికి వ్యతిరేకత పెరుగుతుంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు మిగతా అన్ని ఇండస్ట్రీలలో కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళ బిగ్ బాస్ కు సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అందులో కంటెస్టెంట్లు గొడవ పడడం కనిపిస్తుంది. కమరుద్దీన్, ప్రవీణ్ రాజ్ మధ్య మాటా, మాటా పెరిగి గొడవగా మారుతుంది. ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నారు. అది ప్రోమోలో కనిపిస్తోంది. ఇతర కంటెస్టెంట్లు మధ్యలో ప్రవేశించి గొడవను తగ్గించే ప్రయత్నం చేశారు. అయితే ఈ వీడియో ప్రాంక్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం చూస్తుంటే హౌస్లో నిజంగానే గొడవ జరిగినట్లే అనిపిస్తుంది అని అంటున్నారు. మరోవైపు ఈ షో రేటింగ్ తగ్గిపోవడం వల్లే కంటెస్టెంట్ల మధ్య గొడవలు క్రియేట్ చేస్తున్నారని నెటిజన్లు ఈ వీడియోకి కామెంట్లు పెడుతున్నారు..

Also Read :మూవీలో దారుణమైన లిప్ కిస్ సీన్స్… కత్తిరించేసిన సెన్సార్..


విజయ్ సేతుపతి హోస్ట్ గా ఫెయిల్ అయ్యాడా..? 

ఈ బిగ్ బాస్ మొదలైనప్పటినుంచి తమిళ్ ఇండస్ట్రీలో ప్రసారమైన బిగ్ బాస్ కి హోస్ట్ గా కమల్ హాసన్ వ్యవహారించారు. ఆయన ఇప్పటివరకు చేసిన ప్రతి షో మంచి టాక్ని సొంతం చేసుకుంది.. అయితే ఈ మధ్య కొన్ని కారణాలవల్ల ఈ సీజన్ నుంచి ఆయన తప్పుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఆయన తప్పుకోవడంతో తర్వాత పలువురు స్టార్ హీరోల పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్ గా విజయ్ సేతుపతి ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ సీజన్ 9 ప్రసారమవుతుంది. బిగ్ బాస్ టీమ్ డిఫరెంట్ టాస్కులు ఇస్తుంటారు. వీటిని పూర్తి చిత్రంలో కంటెస్టెంట్లు అదుపుతప్పుతుంటారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. ఇటువంటి సంఘటనే తమిళ బిగ్ బాస్ లో చోటుచేసుకుంది… ఇప్పుడు కూడా హౌస్ లో అలాంటి గొడవ జరిగిందని ఆ వీడియోని చూస్తే తెలుస్తుంది.. ఏది ఏమైనా సరే ఆ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రోమో లో కూడా గొడవలు కంటిన్యూ అవుతున్నట్లు స్పష్టత వచ్చింది.. మరి ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ఈ గొడవపై విజయ్ సేతుపతి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Related News

Bigg Boss 9 Promo: ముద్దుబిడ్డకే చెమటలు పట్టించిన బిగ్ బాస్.. రెచ్చిపోయిన రీతూ!

Kaushal Manda : బిగ్ బాస్ సీజన్ 9 దారుణంగా ఉంది..సెలబ్రేటిలపై కౌశల్ షాకింగ్ కామెంట్స్..

Bigg Boss 9 Telugu : హౌస్ లో ఉండగానే బంఫర్ ఆఫర్ కొట్టేసిన తనూజ.. అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : పాలిటిక్స్ లోకి బిగ్ బాస్ భరణి..? ఆ పార్టీ సపోర్ట్ అతనికే..?

Bigg Boss 9: పాపం ఒంటరైన సంజన.. పేరుకే అమ్మా.. ఏంటి ఇమ్మాన్యుయేల్ ఇది

Bigg Boss 9 Day 58: హౌజ్ లో ఇద్దరు రెబల్స్.. పక్కనే ఉంటూ వెన్నుపోటు.. బలైన కళ్యాణ్, మళ్లీ ఒంటరైన సంజన

Bigg Boss 9: నాన్న పోయి తమ్ముడచ్చాడు.. తనూజకి కొత్త బాండింగ్ దొరికిందోచ్

Big Stories

×