E-Paper
Advertisement

Aasara Pensions: ఆసరా పింఛన్ దారులకు బిగ్ అలర్ట్.. లిస్టులో 60 వేల మంది పేర్లు తొలగింపు!

Aasara Pensions: ఆసరా పింఛన్ దారులకు బిగ్ అలర్ట్.. లిస్టులో 60 వేల మంది పేర్లు తొలగింపు!
Advertisement

Aasara Pensions: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా, సామాజిక భద్రతా పింఛన్ల పథకంలో అనర్హుల ఏరివేత ప్రక్రియ వేగవంతమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రతిగ్రామంలో మరణాల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ వెబ్ సైట్‌లో నమోదు చేస్తున్నారు. మృతి చెందిన పింఛన్ దారుల వివరాలను సైతం ఉన్నతాధికారులకు వెల్లడిస్తూ వారి పింఛన్ పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఆదేశాలు జారీ..

సామాజిక భద్రతా పింఛన్ల జాబితాల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్దేశించింది. ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అనర్హులందరి పేర్లను తొలగించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, అనర్హుల (మరణించిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు, డబుల్ పింఛన్లు తీసుకుంటున్నవారు, ఆర్థికంగా స్థిరపడినవారు) వివరాలను సేకరించి జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. అంతేగాకుండా ప్రతి నెలా పింఛన్ కోసం జాబితా పంపేటప్పుడు సైతం పరిశీలన చేయాలని, మండలంలోని ఎంపీడీఓ, డీఆర్ డీఓ, కలెక్టర్ సైతం క్రాస్ చెక్ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

సెర్ప్ అధికారుల నిరంతర మానిటరింగ్..

Advertisement

అనర్హులకు పింఛన్లు వస్తున్నాయనే ఆరోపణలతో పాటు అక్రమాలు సైతం సోషల్ ఆడిట్ లో వెలుగులోకి వస్తున్నాయి. దీనిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం అర్హులకే అందేలా చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రక్రియను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల వారీగా రోజువారీ నివేదికలను సేకరిస్తూ ప్రక్షాళనను వేగవంతం చేశారు.

Also Read: షాపింగ్ మాత్రమే కాదు, ఇకపై ఫుడ్ కూడా.. Flipkart కొత్త ప్లాన్ మామూలుగా లేదుగా!

లక్ష దాటిన అనర్హుల తొలగింపులు?

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలోనే అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్ పథకంలో అర్హులైన లబ్ధిదారులకే పెన్షన్ అందేలా చేపట్టిన లైవ్ ఆథెంటిఫికేషన్ ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన ధృవీకరణలో లక్షదాటిన అనర్హులను గుర్తించారు. దీంతో ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మరణించినప్పటికీ వారి పేరిట పడుతున్న పింఛనాలను కొందరు డ్రా చేస్తుండటం, అలాగే అర్హత లేని పేర్లను అధికారులు గుర్తించి తొలగిస్తున్నారు.

మూడు నెల్లలోనే 60వేలకు పైగా..

కేవలం మూడు నెలల్లోనే 60వేలకు పైగా అనర్హులను తొలగించినట్లు సమాచారం. అధికారులు ప్రత్యేక నిఘా పెట్టడంతో అనర్హుల గుర్తింపు వేగవంతం అయింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 60వేలకు పైగా అనర్హుల తొలగింపు చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు ఒకే రోజూ ఒక గ్రామంలో 80కి పైగా మృతిచెందినవారి పేర్లను తొలగించినట్లు సమాచారం. అంటే ఏమేరకు పింఛన్లు పక్కదారి పడుతున్నాయనేది స్పష్టమవుతోంది. అంటే ఇప్పటివరకు చనిపోయినవారి పేర పింఛన్లు తీసుకుంటున్నట్లు ఆగ్రామమే నిదర్శనం. అలా ఇంకా ఎంతమంది చనిపోయినవారి పేర పింఛన్లు తీసుకొంటున్నారో గ్రామపంచాయతీ కార్యదర్శులకే తెలియాలి.

గ్రేటర్ పరిధిలో మున్సిపల్ కమిషనర్లదే బాధ్యత

గ్రేటర్ హైదరాబాద్ మన్సిపల్ కార్పొరేషన్ పరిధిలో , ఇతర పట్టణ ప్రాంతాల్లో ఈ ఏరివేత బాధ్యతను పూర్తిగా మున్సిపల్ కమిషనర్లకు అప్పగించినట్లు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో అర్హుల గుర్తింపు, అనర్హుల తొలగింపు బాధ్యతను మున్సిపల్ సిబ్బంది, వార్డు అధికారుల ద్వారా పకడ్బందీగా నిర్వహించనున్నట్లు సమాచారం. పింఛన్ల లిస్టును కమిషనర్లు సంతకం చేస్తేనే ప్రభుత్వం పింఛన్ మంజూరు చేస్తుంది. దీంతోనే వారికే అనర్హులతొలగింపు, చనిపోయినవారి పేరును జాబితా నుంచి తొలగింపు బాధ్యతను కమిషనర్లకే అప్పగించినట్లు తెలిసింది.

Also Read: Dengue Preparedness: డేంజర్ జోన్‌లోకి తెలంగాణ.. ఈ సారీ ముందస్తు చర్యలు నిల్!

స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిడి?

ఈ ప్రక్షాళన ప్రక్రియలో క్షేత్రస్థాయి అధికారులకు రాజకీయ ఒత్తిళ్లు పెద్ద ఎత్తున ఎదురవుతున్నట్లు సమాచారం. తమ అనుచరులు, పార్టీ కార్యకర్తలు అనర్హుల జాబితాలో ఉన్నప్పటికీ వారి పేర్లు తొలగించవద్దంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు పలువురు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ, కొందరు నాయకుల సిఫార్సుల కారణంగా కార్యదర్శులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. మృతిచెందినవారి పింఛన్లు సైతం జాబితా నుంచి తొలగించొద్దని సైతం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

కార్యదర్శులపై నిఘా?

పింఛన్ల ఏరివేత ప్రక్రియలో కొందరు పంచాయతీ కార్యదర్శుల చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అలాంటివారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. లంచాలు తీసుకొని అనర్హులకు మినహాయింపు ఇస్తున్నారనే ఆరోపణలు రాగా, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. మృతిచెందిన వారిపై పింఛన్ మంజూరు కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కార్యదర్శుల పనితీరుపైనా సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం.

Also Read: పెళ్లి పేరుతో సర్పంచ్ మోసం.. ఓ మహిళను గర్భవతిని చేసి పరార్..!

Related News

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఊహించని చిక్కులు.. ఆ ఇద్దరి మంత్రుల వల్ల పనులన్నీ బంద్!

భారీ వర్షాల హెచ్చరిక.. ఐటీ కంపెనీలకు కీలక సూచన, అడ్వైజరీ జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు

Krishna Politics: మీ దొంగ ప్రచారాలు, నాటకాలు ఆపండి.. మంత్రి వాకిటి శ్రీహరి ఫైర్!

సీఎంఆర్ కథ కంచికేనా.. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న రైస్ మిల్లర్లు!

పెళ్లి పేరుతో సర్పంచ్ మోసం.. ఓ మహిళను గర్భవతిని చేసి పరార్..!

Dengue Preparedness: డేంజర్ జోన్‌లోకి తెలంగాణ.. ఈ సారీ ముందస్తు చర్యలు నిల్!

జనగామలో అబార్షన్ తర్వాత తల్లి మృతి.. ఆడపిల్ల పుట్టడం నేరమా అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న ‘బిగ్ టీవీ’ యాంకర్

Big Stories

Advertisement
×