Kiran Abbavaram:కిరణ్ అబ్బవరం…ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన సొంత కష్టంతో నిలదొక్కుకున్న హీరో. ఇక గత సినిమా సూపర్ హిట్ అవడంతో నిన్ననే రిలీజ్ అయిన చెన్నై లవ్ స్టోరీకి కూడా మంచి క్రేజే వచ్చింది.ఇక మా సినిమా సాలిడ్ వసూళ్లు కొల్లగొట్టిందంటూ మేకర్స్ అఫీషియల్ పోస్టర్ వదిలారు కూడా.కానీ రియాలిటీ లో చూస్తుంటే సీన్ వేరేలా ఉందన్నది ఇన్ సైడ్ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్ .
అవును ..ఒక్క నైజాం లోనే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఒకే అనే రెస్పాన్స్ వస్తుంటే, ఆంధ్రా మరియు సీడెడ్ ప్రాంతాల్లో మాత్రం కలెక్షన్ల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందనే వార్తలు నెట్టింట తెగ సర్క్యులేట్ అవుతున్నాయి.ఇక సినిమాకి క్రౌడ్ పుల్లింగ్ కోసం కిరణ్ అబ్బవరం ఒక ప్రమోషనల్ స్కెచ్ వేశాడట కూడా..’చెన్నై లవ్ స్టోరీ’ సినిమా కోసం తను ఒప్పుకున్న మొత్తం పారితోషికం మూడు కోట్ల రూపాయలు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కేవలం రెండు కోట్ల రూపాయలు మాత్రమే రెమ్యూనరేషన్‌గా తీసుకుని, మిగిలిన ఒక కోటి రూపాయలను వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఫ్రీ టికెట్స్ ఇచ్చి థియేటర్లకు జనాన్ని
ఆ మిగిలిన కోటి రూపాయలను తన ఖాతాలో వేసుకోకుండా, నేరుగా టికెట్లు కొని ప్రేక్షకులకు ఉచితంగా పంచిపెట్టాలని కిరణ్ డిసైడ్ అయ్యాడట. ఇలా ఫ్రీ టికెట్స్ ఇచ్చి థియేటర్లకు జనాన్ని రప్పించడం ద్వారా సినిమాపై బజ్ క్రియేట్ చేయవచ్చని, ఒక్కసారి హౌస్‌ఫుల్ బోర్డులు పడి ఆడియన్స్ థియేటర్లోకి వస్తే పాజిటివ్ మౌత్ టాక్ దానంతట అదే స్ప్రెడ్ అవుతుందన్నది కిరణ్ ప్లాన్ అన్నది వినిపిస్తున్న టాక్.
also read:‘ఆ అక్కలంతా ఏమైపోయారు?’.. NEET పేపర్ లీక్‌పై స్పందించిన అనసూయ!
సినిమాల విషయానికి వస్తే
కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో హిట్ టాక్ తెచ్చుకుని ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ (ఆగస్టు 6, 2021)తో సక్సెస్ చూశాడు. ఆ తర్వాత వరుసగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (ఫిబ్రవరి 17, 2023), ‘రూల్స్ రంజన్’ (అక్టోబర్ 6, 2023) వంటి చిత్రాలతో పర్లేదనిపించగా పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘క’ (KA) (అక్టోబర్ 31, 2024) సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సౌండ్ చేశాడు.అయితే సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ మాకు డబ్బు మిగలలేదన్నది ప్రూద్యూసర్ ఆర్గ్యుమెంట్.ఏదైమైనా కిరణ్ కెరీర్ కి మాత్రం ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ అంతా ఇంతా కాదు.ఇక చివరిగా వచ్చిన కె ర్యాంప్ కూడా కాసుల వర్షం కురిపించిన సినిమానే.
ఇక ఆ రెండు సినిమాలు ఇచ్చిన జోష్ తో ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు కిరణ్ . అయితే ‘చెన్నై లవ్ స్టోరీ’ నైజామ్ లో ఆడుతుండగా సీడెడ్ మరియు కోస్తాంధ్ర లో అంతంత మాత్రంగానే ఉండటంతో ఇలా కోటి రూపాయలని కాదనుకుని ప్రీ టికెట్ పాలసీకి కిరణ్ శ్రీకారం చుట్టినట్టు సమాచారం.
మెచ్చుకొని తీరాల్సిందే
సాధారణంగా బాక్సాఫీస్ దగ్గర క్రౌడ్ పెంచడానికి ఈవెంట్లు చేయడం, పబ్లిసిటీ స్టంట్లు చేయడం చూస్తుంటాం కానీ, ఏకంగా తన సొంత పారితోషికంలో ఒక కోటి రూపాయలు కట్ చేసుకుని ప్రేక్షకులకు ఉచితంగా టికెట్లు కొనివ్వాలని చూడటం టాలీవుడ్‌లో నిజంగానే ఒక సంచలనం అని చెప్పాలి.మొత్తానికి తన సినిమాను గట్టెక్కించడానికి, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు రాకుండా చూడటానికి కిరణ్ అబ్బవరం చూపుతున్న ఈ డెడికేషన్ ని మెచ్చుకొని తీరాల్సిందే.