E-Paper
Advertisement

OTT Movie : ఈ ఏడాది జీ5 ఓటీటీలో హయ్యెస్ట్ వ్యూస్ సంపాదించిన సౌత్ సినిమాలు ఇవే

OTT Movie : ఈ ఏడాది జీ5 ఓటీటీలో హయ్యెస్ట్ వ్యూస్ సంపాదించిన సౌత్ సినిమాలు ఇవే
Advertisement

OTT Movie : ఈ ఏడాది తమిళ, తెలుగు సినిమాలు జీ 5 ఓటీటీలో రచ్చ చేస్తున్నాయి. ఈ మూవీలు మిలియన్ల వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ZEE5లో 2025లో అత్యధికంగా వ్యూస్ సాధించిన సౌత్ సినిమాలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ తెలుగు ఫ్యామిలీ డ్రామా బ్రేక్‌ ఔట్ హిట్ తో మిలియన్ల వ్యూస్ సాధించింది. తమిల్ కామెడీ ‘కుడుంబస్థాన్’ వాచ్ టైమ్‌లో టాప్ గా నిలిచింది. మలయాళం థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’ మిస్టరీ లవర్స్‌ని చూపు తిప్పు కోకుండా చేసింది. ఇక సూరి హీరోగా ‘మామన్’ 211 మిలియన్ వాచ్ టైమ్ కొట్టి రికార్డ్ సెట్ చేసింది. ఈ మూవీలు ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్, కామెడీ మిక్స్ చేసి వ్యూయర్స్‌ని ఆకట్టుకున్నాయి.

1.’సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam)

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ 2025లో పొంగల్ కు థియేటర్లలో విడుదల అవ్వడంతో పాటు, ఆడియన్స్ నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా 2025 మార్చి 1న Zee5లో స్ట్రీమింగ్ కి వచ్చినప్పటినుంచి దాదాపు 744 మిలియన్ల వ్యూస్ ని నమోదు చేసింది. ఇందులో ఒక మాజీ పోలీసు అధికారి రాజు, తన మాజీ ప్రియురాలు అయిన ACPకి ఒక కీలకమైన కేసులో సహాయం చేస్తానని హామీ ఇచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. యాక్షన్, కామెడీ సీన్స్ తో ఈ సినిమా పరుగులు పెట్టిస్తుంది. ఐశ్వర్య రాజేష్ రాజు భార్య భాగ్యంగా, అదిరిపోయే కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంది.

2. ‘కుటుంబస్థాన్’ (Kudumbasthan)

Advertisement

మణికందన్ నటించిన ఈ తమిళ సినిమా దాదాపు 360 మిలియన్ల వ్యూస్ తో రెండో స్థానంలో ఉంది. ఇది ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఓ వ్యక్తి పడే కష్టాన్ని చూపిస్తుంది. ఈ సినిమా ఫుల్ మిడిల్ క్లాస్ ఎంటర్టైనర్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సాన్వే మేఘన , గురు సోమసుందరం నటించిన ఈ చిత్రానికి రాజేశ్వర్ కలిసామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2025 మార్చి 7న ఓటీటీలో విడుదలైంది.

3. ‘ఐడెంటిటీ’  (Identity)

టోవినో థామస్, త్రిషా కృష్ణన్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మలయాళం థ్రిల్లర్, 2025లో హైయెస్ట్ గ్రాస్ మలయాళ ఫిల్మ్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ కథ ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ‘ఐడెంటిటీ’ సినిమా ఓటీటీలో విడుదలైనప్పటి నుండి దాదాపు 328 మిలియన్ల వ్యూస్ తో మూడవ స్థానంలో నిలిచింది.

4. ‘మామన్’ (Maaman)

Advertisement

సూరి మెయిన్ హీరోగా వచ్చిన ఈ తమిల్ ఫ్యామిలీ డ్రామా, అయ్యప్పన్ (సూరి) అతని చిన్న అన్నయ్య (భావన్) బాండ్ చుట్టూ తిరుగుతుంది. అయ్యప్పన్ మ్యారేజ్ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ వచ్చినా, అన్నయ్యతో బాండ్ వల్ల అంతా సెట్ అవుతుంది. అశ్వర్య లక్ష్మి భార్య పాత్రలో నటించింది. ZEE5లో 2025 ఆగస్టు 8, నుంచి స్ట్రీమింగ్ మొదలై, 211 మిలియన్ వాచ్ టైమ్ సాధించి టాప్ పెర్ఫార్మర్ అయింది. ఇందులో ఫ్యామిలీ బాండ్, ఎమోషన్స్ అదిరిపోయాయి.

5. ‘సుమతి వలవు’ (Sumathi Valavu)

అర్జున్ అశోకన్ నటించిన హర్రర్ కామెడీ, సుమతి వలవు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకుంది. 2025 సెప్టెంబర్ 26న స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ చిత్రం దాదాపు 182 మిలియన్ల వ్యూస్ ని నమోదు చేసింది. ఒక భయంకరమైన రోడ్డు ఆధారంగా సాగే ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ వావ్ అనిపించాయి.

Read Also : దేవుడి పేరుతో దిక్కుమాలిన పనులు… అమ్మాయిలను వదలకుండా… మతిపోగోట్టే సస్పెన్స్ థ్రిల్లర్

Related News

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

Big Stories

Advertisement
×