Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. శ్రీ లీల, రాశి ఖన్నా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ చాలా ప్రత్యేకంగా ఈ సినిమాను డిజైన్ చేస్తున్నాడు. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన కంటెంట్ కూడా విపరీతమైన రెస్పాన్స్ సాధించుకుంది.
పవన్ కళ్యాణ్ ఎటువంటి డైలాగులు చెప్తే బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవుతుందో అనే క్లారిటీ ఉన్న దర్శకుడు హరీష్ శంకర్. హరీష్ శంకర్ విడుదల చేసిన వీడియోలో కూడా గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అనే డైలాగ్ రాసాడు. గాజు గ్లాసు అనేది పవన్ కళ్యాణ్ పార్టీ సింబల్ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
అనే మొదటి టీజర్ విడుదలైనప్పుడు దేవుడి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ టైటిల్ రివిల్ అవుతుంది. విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని ఎంతలా ప్రేమిస్తారో అందరికీ తెలిసిందే. అయితే వీరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా డేట్ నిర్మాత రవి అనౌన్స్ చేసేసారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక సెన్సేషన్. ఓజి సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మీకు తెలుసు దాన్ని దాటి ఈ సినిమా ఉండబోతుంది అని మేము బలంగా నమ్ముతున్నాం. ఆ కంటెంట్ లో ఉన్న విషయం అలాంటిది.
ఏప్రిల్ 26వ తారీఖున ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను విడుదల చేయబోతున్నాం. దాని స్కేల్ , హరీష్ శంకర్ ప్రేమించి చేసింది కానీ ఆ స్టార్ కి ఇచ్చే ట్రిబ్యూట్ కానీ, నా ప్రొడక్షన్ హౌస్ మేం ఇచ్చే ట్రిబ్యూట్ కానీ అందరి ఎనర్జీ కూడా 26 ఏప్రిల్ తారీకున వస్తాద్ భగత్ సింగ్ ఇరగ్గొడతాడు. రికార్డులన్నీ తన వైపు తిప్పేసుకుంటాడు. ఏ ప్లేస్ లో మాట్లాడిన ఏ జిల్లా రికార్డ్స్ మాట్లాడిన వినిపించే ఏకైక పేరు కేవలం ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే అని రవి అనౌన్స్ చేసేసారు.
అయితే ఈ డేట్ ఉన్నఫలంగా అనౌన్స్ చేయడానికి కారణం ఏంటి అనేది అంతుచిక్కని విషయం. మామూలుగా ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకి చాలా బిగ్గెస్ట్ హ్యాపీ న్యూస్ అని చెప్పాలి. ఇటువంటి హ్యాపీ న్యూస్ ని అంత సింపుల్ గా ఎలా చెప్పేశారు అని డౌట్ కూడా కొంతమందికి వస్తుంది. సూపర్ గా పవన్ కళ్యాణ్ స్టిల్ తో ఒక పోస్టర్ విడుదల చేస్తే ఆ హై ఇంకా బాగుంటుంది కదా అనేది కొంతమంది అభిప్రాయం.
Also Read: The Raja Saab Song Promo : రాజా సాబ్ వచ్చేసాడు, అదిరిపోయే ప్రోమో ఇక్కడ చూసేయండి