E-Paper
Advertisement

Anil Ravipudi : నాగార్జునతో అనిల్ రావిపూడి మూవీ.. క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్!

Anil Ravipudi : నాగార్జునతో అనిల్ రావిపూడి మూవీ.. క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్!
Advertisement

Anil Ravipudi: అనిల్ రావిపూడి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. పటాస్ సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అనిల్ రావిపూడి(Anil Ravipudi) మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా తదుపరి వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇప్పటివరకు అనిల్ రావిపూడి డైరెక్షన్లో 8 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా ఈ ఎనిమిది సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా నిర్మాతలకు భారీ లాభాలను కూడా అందించాయి. రాజమౌళి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని డైరెక్టర్ల జాబితాలో అనిల్ రావిపూడి ఉన్నారని చెప్పాలి.

నాగార్జునతో అనిల్ రావిపూడి మూవీ ?

ఇక ఈ ఏడాది అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏకంగా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈయన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో మరో సినిమాని ప్రకటించారు. మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) అనే సినిమా ద్వారా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి నాగార్జునతో సినిమా చేయడం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

చిరు ఒరిజినల్ పేరుతోనే టైటిల్ ..

Advertisement

ఈ సందర్భంగా మీడియా వారు అనిల్ రావిపూడిని పలు ప్రశ్నలు వేశారు. అసలు ఈ సినిమాకు మన శంకర్ వరప్రసాద్ గారి అనే టైటిల్ ఎందుకు పెట్టాలనుకున్నారనే ప్రశ్న ఎదురవడంతో సినిమా పెద్ద టైటిల్ కంటే ఆ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందనేది ముఖ్యం అందుకే చిరంజీవి గారి ఒరిజినల్ పేరుతోనే టైటిల్ పెట్టాలని చెప్పగా చిరంజీవి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అందుకే ఈ టైటిల్ పెట్టానని తెలియజేశారు. ఇప్పటికే బాలకృష్ణ, చిరంజీవి వెంకటేష్ తో సినిమా చేశారు మరి నాగార్జునతో సినిమా ఎప్పుడు అనే ప్రశ్న కూడా ఎదురయింది.

భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు..

Advertisement

ఈ ప్రశ్నకు అనిల్ రావిపూడి సమాధానం చెబుతూ ఈ ముగ్గురు స్టార్ సీనియర్ హీరోలతో సినిమా చేశాను. అయితే నాగార్జున గారితో కూడా తప్పకుండా నా సినిమా ఉంటుందని ఆయన ఒప్పుకుంటే సినిమా చేయడానికి తాను సిద్ధమేనని కచ్చితంగా మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటూ ఈ సందర్భంగా అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో తెలియాల్సి ఉంది. అనిల్ రావిపూడి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం ఎఫ్ 2 ,ఎఫ్ 3 వంటి సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమా చేయడమే కాకుండా ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఇక చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు చేయబోతున్నారు. ఇక మిగిలింది నాగార్జున మాత్రమే, ఆయనతో కూడా తప్పకుండా సినిమా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

Also Read: Chiranjeevi Fan: ఆస్తి అమ్మి ఆగమైన అభిమాని..బాస్ భరోసా కోసం ఎదురుచూపులు

Related News

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

Big Stories

Advertisement
×