E-Paper
Advertisement

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?
Advertisement

Garividi Lakshmi:‘గరివిడి లక్ష్మి’ నిజ జీవితంలో ఆర్పీ పట్నాయక్‌ ఒక విలన్ అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఊదరగొట్టేస్తున్న సంగతి తెల్సిందే.ఇక తాజాగా ‘గరివిడి లక్ష్మి’ రిలీజ్ అయి సూపర్ హిట్ అవడంతో సక్సెస్ మీట్ నిర్వహించిన మేకర్స్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో ప్రశ్నకు దర్శకుడు గౌరీ నాయుడు ఇలా సమాధానం చెప్పుకొచ్చాడు.

గౌరీ నాయుడు మాట్లాడుతూ ఆర్పీ పట్నాయక్ నిజాయతీగానే గరివిడి లక్ష్మిని కలిశారని, కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని గౌరీ నాయుడు వివరించారు. అయితే, ఆ సినిమాలోని పాత్రకు సంబంధించి కొన్ని అవసరాలు ఉండటంతో ఆర్పీ పట్నాయక్ చేయలేకపోయారని చెప్పారు. సినిమాలో ఆ విషయాన్ని కూడా చూపించామని, ఆయన ఎందుకు చేయలేకపోయారో ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చారు.తమకి సినిమాలో ఆయన్ని నెగిటివ్‌గా చూపించాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

Advertisement

ఇప్పటివరకు ప్రేక్షకులకు తెలియని కొన్ని విషయాలను సినిమాలో చూపించడం వల్ల అసలు ఏం జరిగిందో అర్థమవుతుందని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఒక వ్యక్తిని కావాలనే తప్పుగా చూపించాలనే ఉద్దేశంతో కాకుండా, జరిగిన సంఘటనలను ప్రేక్షకులకు తెలియజేయాలనే కోణంలో సీన్స్ రాసుకున్నట్టు చెప్పారు.

ఇదిలా ఉంటే, ‘గరివిడి లక్ష్మి’ సినిమా కోసం మూవీ చాలా కష్టపడిందని సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తెలిపారు. ఉత్తరాంధ్ర యాస, అక్కడి సంస్కృతి, స్థానిక మూలాలను సినిమాలో సహజంగా చూపించడానికి దర్శకుడు గౌరీ నాయుడు ఎంతో సహకరించారని చెప్పారు. తనలోని సంగీత ప్రతిభను గుర్తించి, తనపై నమ్మకంతో ఈ సినిమాలో అవకాశం ఇచ్చారని ఆకాశానికి ఎత్తేశారు.

Advertisement

ఇక తన లైఫ్ లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న సమయంలో గౌరీ నాయుడు తన స్టూడియోకి వచ్చారని, ఆ పరిచయం క్రమంగా అన్నదమ్ముల అనుబంధంగా మారిందని చరణ్ అర్జున్ ఎమోషనల్ అయ్యారు.. సినిమాలో ఉత్తరాంధ్ర ప్రాంతపు వాతావరణం, స్థానికతను చూపెట్టేందుకు దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని వివరించారు.

అలాగే, నిర్మాతలు విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్నారని చరణ్ అర్జున్ ప్రశంసించారు. కొత్త దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా సినీ ఇండస్ట్రీలో మరింతమందికి దారి చూపిస్తున్నారని అన్నారు.

మొత్తానికి, ‘గరివిడి లక్ష్మి’ సినిమాలో ఆర్పీ పట్నాయక్‌ను నెగిటివ్‌గా చూపించారనే ప్రశ్నకు గౌరీ నాయుడు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూడాలి మరి ఈ విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్‌ ఎలా రియాక్ట్ అవుతాడో !

ALSO READ :క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Tags

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×