E-Paper
Advertisement

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?
Advertisement

Jhansi Interview:తెలుగు ఆడియన్స్ కి నటి, యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తనదైన మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. సినిమాల్లో కూడా సరికొత్త పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ముఖ్యంగా ‘జయం మనదేరా’, ‘తులసి’, ‘అష్టా చమ్మా’, ‘సలార్’ వంటి సినిమాల్లో చేసిన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. అయితే ఝాన్సీ నటిగా ఎదగడం వెనుక ఉన్న పలు ఆసక్తికరమైన సంఘటనలని భార్గవి నిర్వహించిన ‘నవరస’ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చారు ఝాన్సీ.

Advertisement

తన కెరీర్ మొదట్లో ‘టాక్ ఆఫ్ ది టౌన్’ షో మంచి గుర్తింపు తెచ్చిందని ఈ షోలో ఒక్కోసారి ఒక్కో పాత్రలో కనిపించే అవకాశం రావడంతో తనలోని టాలెంట్ ని బయటపెట్టానని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా తనలో మంచి నటి ఉందనే విషయం ఇతరులకు తెలిసిందని, సినిమాల్లో అవకాశాలు రావడానికి కూడా ఇది ఉపయోగపడిందని వివరించారు.

ఇక నటించడం మొదలుపెట్టిన సమయంలో ఏదీ ఈజీగా రాలేదని ముఖ్యంగా ఎమోషన్స్ ని న్యాచురల్ గా పండించడం కోసం చాలా విషయాలు నేర్చుకోవాల్సి వచ్చిందని ఝాన్సీ గుర్తుచేసుకున్నారు. నవ్వును కూడా ప్రాక్టీస్ చేయాల్సిన సందర్భాలుఉన్నాయని, అనుభవంతోనే నటనలో మంచి ఇంప్రూవ్ అయ్యానని చెప్పుకొచ్చారు.

Advertisement

ఇక వెంకటేశ్ నటించిన ‘జయం మనదేరా’ సినిమాలో ఆయన చెల్లి పాత్ర చేయడం తనకు మంచి గుర్తింపు తెచ్చిందని తెలిపారు. ఆ తర్వాత ‘తులసి’ సినిమాలో నటించిన పాత్రకు నంది అవార్డు రావడం తన కెరీర్‌లో మర్చిపోలేని అనుభవమని ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడాల్సి రావడంతో పాత్రకు తగ్గట్టుగా ప్రయత్నించానని దర్శకుడు బోయపాటి శ్రీను, తోటినటుల సహకారం వల్ల ఆ పాత్ర బాగా పండిందని తన అభిప్రాయన్ని చెప్పారు.
పడ్డారు.

అలాగే ‘అష్టా చమ్మా’ సినిమాలో స్వాతి అత్తగా కనిపించే పాత్రను మొదట చేయాలని అనుకోలేదని , దాని బదులుగా మరో పాత్ర చేయాలనే ఆలోచన వచ్చిందని ఝాన్సీ చెప్పారు. అయితే దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఆ పాత్ర గురించి వివరించిన తర్వాత ఒప్పుకున్నానని తెలిపారు. చివరికి ఆ పాత్ర ప్రేక్షకులకు నచ్చడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.

ఇక ప్రభాస్ నటించిన ‘సలార్’, నాని నటించిన ‘దసరా’, ‘మల్లేశం’ వంటి సినిమాల కోసం కూడా ఆడిషన్లు ఇచ్చినట్లు చెప్పారు.ముఖ్యంగా ‘స్పీడున్నోడు’ సినిమాలో చేసిన చిన్న పాత్ర ద్వారా  ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాలో అవకాశం వచ్చిందని తన నటనను గమనించిన రచయిత హనుమాన్ చౌదరి  ‘సలార్’లో ఒబులమ్మ పాత్రకు రిఫర్ చేశారని చెప్పుకొచ్చారు.అయితే  ఆ పాత్ర కోసం ఆడిషన్ ఇవ్వడానికి కూడా వెనుకాడలేదని, ఇప్పటికే యాంకర్‌గా, నటిగా గుర్తింపు ఉన్నప్పటికీ అవకాశం కోసం ప్రయత్నించానని తెలిపారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ తనకు అవకాశం ఇవ్వడం పట్ల ఝాన్సీ కృతజ్ఞతలు తెలిపారు. తన స్థాయికి తగ్గ పెద్ద పాత్ర కాకపోవచ్చని ఆయన చెప్పినప్పటికీ, తనకు మాత్రం ఆ పాత్ర ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని గుర్తు చేసుకున్నారు.

ఇప్పటికే నటిగా గుర్తింపు వచ్చినప్పటికీ, ఒక పాత్రకు తాను సరిపోతానని నిరూపించుకోవడానికి ఆడిషన్ ఇవ్వడం తప్పుగా భావించనని , దర్శకులు కోరుకున్న పాత్రకు తగినట్లు కనిపించడం, అవసరమైన మార్పులు చేసుకోవడం నటిగా తన బాధ్యత అని కొత్తగా వచ్చే నటీనటులకి ఇన్స్పిరేషన్ అని చెప్పకతప్పదు !

ALSO READ :ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

Tags

Related News

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

ఎవరీ సాత్విక.. ఒక్క టీజర్ తోనే ఊహించని క్రేజ్!

కీర్తి సురేష్ పుట్టినరోజు స్పెషల్.. ‘అక్క’ టీజర్ రిలీజ్ !

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

Big Stories

Advertisement
×