E-Paper
Advertisement

Toxic Teaser: యశ్ టాక్సిక్ టీజర్ రిలీజ్.. ఊహించని ట్విస్ట్ అదుర్స్!

Toxic Teaser: యశ్ టాక్సిక్ టీజర్ రిలీజ్.. ఊహించని ట్విస్ట్ అదుర్స్!
Advertisement

Toxic Teaser:ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ (Yash) హీరోగా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్ (Toxic). ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఎప్పుడు మాస్ యాక్షన్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే యష్ ఈ టాక్సిక్ సినిమాతో అంతకుమించి వైలెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ఈ టీజర్ ఎలా ఉంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.

టాక్సిక్ టీజర్ ఎలా ఉందంటే?

టాక్సిక్ టీజర్ విషయానికి వస్తే.. 1:56 నిమిషాల నిడివి ఉన్న తెలుగు టీజర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. “ఈసారి యుద్ధం వేరు.. వాళ్ల కుతంత్రాలు వేరు” అంటూ ఊహించని విధంగా సర్కస్ బ్యాక్ డ్రాప్ లో టీజర్ ప్రారంభించారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. చూసే ఆడియన్స్ను భయభ్రాంతులకు గురి చేసేలా యాక్షన్ వయలెన్స్ తో గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని చెప్పవచ్చు. యశ్ మాస్ లుక్స్, అదిరిపోయే మ్యూజిక్ తో టీజర్ ను ఆకట్టుకుంటుంది ఇక వయలెన్స్, మాస్, యాక్షన్ ఎక్కువగా ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా ఒక మంచి ఫీస్ట్ అని చెప్పవచ్చు.

Advertisement

ఇకపోతే టీజర్ చూశాక.. గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని పక్కా గ్యాంగ్ స్టార్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించింది. టీజర్ లోని వయలెన్స్ షార్ట్స్ చూస్తుంటే ఈ సినిమాకి కచ్చితంగా A సర్టిఫికెట్ పొందే అవకాశం ఉందని అటు సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మునుపెన్నడూ చూడని విధంగా యశ్ బాడీ లాంగ్వేజ్, లుక్స్ ఇందులో చాలా వైల్డ్ గా కనిపిస్తున్నాయి.

విజువల్స్ విషయానికి వస్తే.. కొన్ని షాట్స్ అత్యున్నత ప్రమాణాలతో షూట్ చేశారు. అటు సినిమాటోగ్రాఫీ , కలర్ గ్రేడింగ్ కూడా సినిమా మూడ్ కు తగ్గట్టుగానే చాలా డార్క్ గా ఇంటెన్స్ గా డిజైన్ చేశారు. మొత్తానికి అయితే కేజీఎఫ్ తర్వాత యశ్ నుంచి వస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరో సునామీ సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. పైగా ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా యశ్ కి గ్లోబల్ స్టార్ రేంజ్ అందివ్వడం ఖాయంగా అనిపిస్తుంది. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లలో రిలీజ్ చేయనున్నారు.

టాక్సిక్ సినిమా విశేషాలు.

Advertisement

టాక్సిక్ సినిమా విషయానికి వస్తే.. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తారా సుతారియా, హుమా ఖురేషి, నయనతార , రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఇందులో యశ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ ఈ ఏడాది మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ALSO READ:Vijay -Rashmika: విజయ్ – రష్మిక మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×