E-Paper
Advertisement

Eric Dane: X-Men నటుడు ఎరిక్ డేన్ మృతి..ALS వ్యాధితో పోరాడి..!

Eric Dane: X-Men నటుడు ఎరిక్ డేన్ మృతి..ALS వ్యాధితో పోరాడి..!
Advertisement

Eric Dane: ప్రముఖ హాలీవుడ్ నటుడు Eric Dane ఇక లేరు. ఆయన వయసు 53 ఏళ్లు. Grey’s Anatomy అనే ప్రసిద్ధ టీవీ సీరియల్‌లో డాక్టర్ మార్క్ స్లోన్ పాత్రతో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఒక సంవత్సరం క్రితం తనకు ALS (అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లీరోసిస్) అనే నాడీ సంబంధిత వ్యాధి ఉందని ఎరిక్ డేన్ స్వయంగా వెల్లడించారు. తాజాగా ఆయన కుటుంబ సభ్యులు..సన్నిహితుల సమక్షంలో శాంతిగా కన్నుమూశారు.

ఈ నటుడు..X-Men, వాలెంటైన్స్ డే, బాడ్ బాయ్స్ లాంటి సినిమాల్లో నటించారు.

ALS అంటే ఏంటి..!

Advertisement

ALS అనేది అరుదైన కానీ తీవ్రమైన వ్యాధి. ఇది మన మెదడు, వెన్నుపాము నుంచి కండరాలకు వెళ్లే నాడీకణాలను నెమ్మదిగా దెబ్బతీస్తుంది. దీని వల్ల కండరాల బలహీనత, కదలికల్లో ఇబ్బంది, మాట్లాడటం, మింగడం, శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఎరిక్ డేన్ తన వ్యాధి గురించి బహిరంగంగా మాట్లాడటం వల్ల చాలా మందిలో ఈ వ్యాధిపై అవగాహన పెరిగింది.

ALS లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తాయి. మొదట చేతులు, కాళ్లలో బలహీనత కనిపించవచ్చు. చిన్న పనులు చేయడంలో ఇబ్బంది, కండరాలు కొట్టుకోవడం, నడవడంలో అసౌకర్యం మొదలవుతాయి. తరువాత దశలో మాట తడబడటం, ఆహారం మింగడంలో కష్టం, శ్వాస సమస్యలు రావచ్చు. చివరి దశలో పూర్తిగా కదలలేని పరిస్థితి కూడా రావచ్చు.

Advertisement

ఈ వ్యాధికి పూర్తి నివారణ మందు ఇప్పటికీ లేదు. అయితే కొన్ని మందులు వ్యాధి పురోగతిని కొంతవరకు నెమ్మదించగలవు. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, శ్వాస సహాయ పరికరాలు రోగులకు ఉపశమనాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.

ఎరిక్ డేన్ మరణం ఒక విషయం స్పష్టంగా గుర్తు చేస్తోంది. అరుదైన వ్యాధులపై అవగాహన ఎంత ముఖ్యమో ఆయన జీవితమే ఉదాహరణ. శరీరంలో అసాధారణ మార్పులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా.. వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. సరైన సమయంలో గుర్తిస్తే, జీవన నాణ్యతను కొంతవరకు మెరుగుపరచుకోవచ్చు.

ALSO READ: Naa Anvesh : ఇన్స్టాగ్రామ్ బ్యాన్ పై స్పందించిన అన్వేష్.. బత్తాయిలకు నరకం చూపిస్తాను..

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×