E-Paper
Advertisement

Ghattamaneni Jayakrishna: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. టైటిల్‌, ప్రీలుక్‌కి ముహుర్తం ఫిక్స్!

Ghattamaneni Jayakrishna: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. టైటిల్‌, ప్రీలుక్‌కి ముహుర్తం ఫిక్స్!
Advertisement

AB4 Title and Pre-look: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడు సినీరంగం ఎంట్రీకి సిద్దమైన సంగతి తెలిసిందే. దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత హీరో రమేష్‌ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. ఆర్‌ఎక్స్‌ 100, మంగళవారం వంటి చిత్రాల దర్శకుడు అజయ్‌ భూపతి జయకృష్ణ ఎంట్రీ బాధ్యతలు తీసుకున్నాడు.

అజయ్ భూపతితో ఘట్టమనేని వారసుడు

తన నాలుగొవ చిత్రం వస్తున్న ఈసినిమాను AB4 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ప్రకటించుకున్నాడు అజయ్‌ భూపతి. ఆయన దర్శకత్వంలో సీనియర్‌ నిర్మాత అశ్వినీ దత్ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్‌ అనే కొత్త బ్యానర్‌పై పి కిరణ్‌ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇప్ప టికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసుకుని గ్రాండ్‌గా లాంచ్‌ అయిన ఈ చిత్రం నుంచి మొదటి అప్‌డేట్‌ రాబోతోంది. ఈ మేరకు అజయ్‌ భూపతి ఓ ట్వీట్‌ చేశారు. “ఆడియన్స్‌ మనసుని తాకే ప్రతి కథ వెనుక ఓన్‌ వే ఉంటుంది. రేపు ఈ చిత్రం నుంచి టైటిల్‌, ప్రీలుక్‌ రాబోతోంది.

రేపు టైటిల్, ప్రీలుక్

Advertisement

గురువారం (నవంబర్‌ 27) ఉదయం 11: 07 గంటలకు ఈ సినిమా ప్రీలుక్‌, టైటిల్ ప్రకటిస్తాం” అని మేకర్స్‌ వెల్లడించారు. దీంతో అప్‌డేట్‌తో ఘట్టమనేన ఫ్యాన్స్‌ అంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. మహేష్‌ బాబు తర్వాత ఘట్టమనేని వారసుడిగా ఆయన తనయుడు గౌతమ్‌ ఘట్టమనే ఎంట్రీ ఇస్తాడని అంత అనుకున్నారు. కానీ, అంతకముందే సూపర్‌ స్టార్‌ కృష్ణ నట వారసుడిగా జయకృష్ణ ఎంట్రీ ఇస్తుండటంతో ఘట్టమనేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాబాయ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ ప్రొత్సాహంతో జయకృష్ణ హీరోగా తెరంగేట్రం చేస్తున్నారు. మరి ఈ ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ హీరో తన నటనతో ఆడియన్స్‌ ఎలా మెప్పించబోతున్నాడనేది ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమాలో జయకృష్ణ సరసన బాలీవుడ్‌ బ్యూటీ రాషా టాండన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

శ్రీనివాస మంగాపురం టైటిల్?

Advertisement

బాలీవుడ్‌ సీనియన్‌ హీరోయిన్‌ రవీనా టాండన్‌ కూతురే రాషా టాండన్‌. ఈ చిత్రంలోనే ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. ఇద్దరు డెబ్యూ హీరోహీరోయిన్లుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ బ్యాక్‌డ్రాప్‌, జానర్‌ ఏంటనేది ఆడియన్స్‌, అభిమానుల్లో క్యూరియాసిటి నెలకొంది. మరి వీటన్నింటికి రేపటితో క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్న టాక్‌ వినిపిస్తుంది. కొన్ని రోజులుగా ఈ టైటిల్‌ ప్రచారంలో ఉంది. మరి ఈ బజ్‌ ప్రకారం ఈ సినమిఆకే ఇదే టైటిల్‌ ఫిక్స్‌ చేస్తారా? లేదా? అనేది రేపటితో క్లారిటీ రానుంది. ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ ప్రకారం చూస్తే.. ఈ చిత్రం తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని అర్థమౌతుంది.

Also Read: Varanasi Movie: గ్లోబ్‌ ట్రాటర్‌.. మహేష్‌ ఎంట్రీ వెనుక జక్కన్న కష్టం చూశారా? మేకింగ్‌ వీడియో వైరల్‌

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×