BigTV English

SYG Glimpse : సాయి ధరమ్ తేజ్ అసుర ఆగమన… థియేటర్లు బద్దలవ్వడం ఖాయం

SYG Glimpse : సాయి ధరమ్ తేజ్ అసుర ఆగమన… థియేటర్లు బద్దలవ్వడం ఖాయం
Advertisement

SYG Glimpse: మెగా హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం సంబరాల ఏటిగట్టు.. రోహిత్ కెపి ఈ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తుండగా హనుమాన్ ఫేం ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ లుక్ లో సాయి దుర్గ తేజ్ కనిపిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయి దుర్గ తేజ్ లుక్ పై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ మూవీ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. గ్లింప్స్ వీడియో ఎలా ఉందంటే..


ఆకట్టుకుంటున్న సంబరాల ఏటి గట్టు గ్లింప్స్..

సాయి దుర్గ తేజ గతంలో ఎన్నడు కనిపించని మాస్ లుక్ లో కనిపించడం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు చూస్తుంటే భారీ యాక్షన్ సినిమాగా రాబోతుందని తెలుస్తుంది.. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. అసుర ఆగమన మొదలైంది అంటూ రిలీజ్ అయిన ఈ వీడియోలో సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.. అసుర సంధ్య వేళ ఆగమనం మొదలైంది అంటూ సాయి దుర్గ తేజ్ పవర్ఫుల్ డైలాగ్ తో గ్లింప్స్ వీడియో మొదలవుతుంది.. రక్తపాతం, తన అనుకున్న వాళ్ళని కాపాడే ప్రయత్నం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. హీరో కత్తి పట్టడం, బ్యాగ్రౌండ్ మొత్తానికి గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Also Read : బిగ్ డిజాస్టర్ దిశగా ‘కాంతార చాప్టర్ 1’… బ్రేక్ ఈవెన్ కూడా కష్టమేనా ?


ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో స్టోరీ.. 

సాలిడ్ యాక్షన్ డ్రామా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇది కేవలం రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందడం మాత్రమే కాదు.. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉన్నట్టు ఇప్పుడు తెలుస్తుంది.. మైథలాజి టచ్ కూడా ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి స్టోరీ తో గతంలో హనుమాన్ సినిమా వచ్చింది. మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఈ సినిమాలో కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారా అన్నది తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు సాయి తేజ్ కెరీర్లోనే రికార్డు బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ, జగపతి బాబు, సాయి కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ గ్లింప్స్ వీడియోను చూస్తుంటే మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేలా కనిపిస్తుంది. చూడాలి మరి ఈ మూవీ తో సాయి దుర్గ తేజ అకౌంట్ లో మరో హిట్ పడుతుందో? లేదో..

Related News

Niharika: లవ్ యూ బావ.. క్యూట్ ఫోటో షేర్ చేసిన నిహారిక.. ఫోటో వైరల్!

Tollywood: ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ సింగర్ బాల సరస్వతి కన్నుమూత!

Rishab Shetty: బ్యాన్ ఎఫెక్ట్… తెలుగు వాళ్ల దెబ్బకు దిగొస్తున్న రిషబ్ శెట్టి

HBD Sai Dharam Tej: మెగా కాంపౌండ్ హీరో… ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా ?

Kantara Chapter 1 : బిగ్ డిజాస్టర్ దిశగా ‘కాంతార చాప్టర్ 1’… బ్రేక్ ఈవెన్ కూడా కష్టమేనా ?

Kantara Chapter 2: రిషబ్ మాస్టర్ ప్లాన్.. అలాంటి పాత్రలో ఎన్టీఆర్ !

Hrithik Roshan: ఢిల్లీ హైకోర్టుకు హృతిక్ రోషన్.. నేడే విచారణ!

Big Stories

×