BigTV English

Kantara Chapter 1 : బిగ్ డిజాస్టర్ దిశగా ‘కాంతార చాప్టర్ 1’… బ్రేక్ ఈవెన్ కూడా కష్టమేనా ?

Kantara Chapter 1 : బిగ్ డిజాస్టర్ దిశగా ‘కాంతార చాప్టర్ 1’… బ్రేక్ ఈవెన్ కూడా కష్టమేనా ?
Advertisement

Kantara Chapter 1 : కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన లేటెస్ట్ చిత్రం కాంతారా చాప్టర్ 1.. ఈనెల దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తుంది. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ని అందుకుంటూ కలెక్షన్లను కొల్లగొట్టేస్తుంది.. కేవలం 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 655 కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది. హిందీలో రూ.150 కోట్ల మార్క్‌ దాటగా, కన్నడలోనే రూ.100 కోట్ల గ్రాస్‌ సాధించింది.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇండియా వైడ్ మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది కానీ ఓవర్సీస్ లో మాత్రం దిమ్మతిరిగే షాక్ ఎదురైంది.. అక్కడ పరిస్థితి చూస్తుంటే బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమేనని వార్తలు వినిపిస్తున్నాయి.


ఓవర్సీస్ లో కాంతార డిజాస్టర్.. 

ఇండియాలో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా యుఎస్ లో కూడా ఆ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కన్నా అక్కడ ఒకరోజు ముందుగా ప్రీమియర్ షోలు పడిపోతాయి. రీసెంట్ గా కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన చిత్రం కాంతార చాప్టర్ 1 అక్కడ భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఎందుకో ఏమో కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ అంతగా లభించలేదని తెలుస్తుంది. అందుకు కారణం అక్కడ కలెక్షన్లు దారుణంగా పడిపోవడమే. ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటి వరకు 4.3 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టినట్లు నిర్మాతలు తెలిపారు.. అక్కడ ఎనిమిది మిలియన్ డాలర్లతో ఈ సినిమాని కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బ్రేక్ ఇవ్వండి రావాలంటే మరో ఐదు మిలియన్ డాలర్లను వసూలు చేయాలి. ఇది కష్టమే అనిపిస్తుంది.. మరో వారం ఇక్కడ వసూళ్లు పెరుగుతాయేమో చూడాలి..

Also Read : బిగ్ బాస్ లోకి శ్రీజ రీఎంట్రీ.. ఆడియన్స్ కు మెంటలెక్కించే ట్విస్ట్..


కలెక్షన్ల విషయానికొస్తే.. 

గతంలో వచ్చిన కాంతార సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాతో పోలిస్తే ఈ సినిమాకు కలెక్షన్లు భారీగానే వచ్చి పడుతున్నాయి. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ షో ఫస్ట్ డే 89 కోట్లు వసూలు చేసింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లోనూ ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది.. 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 655 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. హిందీలో రూ. 150 కోట్ల మార్కును దాటేసింది. ఇండియాలో మాత్రం వరుసగా రికార్డ్లను బ్రేక్ చేస్తున్న ఏ సినిమాకు ఓవర్సీస్ లో దారుణంగా మారుతుంది. మరి మూడో వారం ఏమైనా కలెక్షన్లు పెరుగుతాయేమో అని అక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.. మరి వాళ్ళ కోరిక నెరవేరుతుందా లేదా చూడాలి.. ఇకపోతే కాంతార 3 కూడా రాబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించబోతున్నారంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related News

Tollywood: ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ సింగర్ బాల సరస్వతి కన్నుమూత!

Rishab Shetty: బ్యాన్ ఎఫెక్ట్… తెలుగు వాళ్ల దెబ్బకు దిగొస్తున్న రిషబ్ శెట్టి

HBD Sai Dharam Tej: మెగా కాంపౌండ్ హీరో… ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా ?

SYG Glimpse : సాయి ధరమ్ తేజ్ అసుర ఆగమన… థియేటర్లు బద్దలవ్వడం ఖాయం

Kantara Chapter 2: రిషబ్ మాస్టర్ ప్లాన్.. అలాంటి పాత్రలో ఎన్టీఆర్ !

Hrithik Roshan: ఢిల్లీ హైకోర్టుకు హృతిక్ రోషన్.. నేడే విచారణ!

Star Singer: క్యాన్సర్ తో గ్రామీ విజేత కన్నుమూత

Big Stories

×