E-Paper
Advertisement

నిఖిల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘స్వయంబు’ రిలీజ్ అప్పడే..?

నిఖిల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘స్వయంబు’ రిలీజ్ అప్పడే..?
Advertisement

Swayambhu Movie : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నుంచి కార్తికేయ 2 సినిమా తర్వాత పెద్దగా సినిమాలు రాలేదు.. ఈ సినిమా తర్వాత ప్రకటించిన స్వయంభు మూవీ కూడా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. దానికి కారణం షూటింగ్ ఇంకాస్త పెండింగ్ ఉండడమే అని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అయితే ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. నిఖిల్ లుక్కు ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఇక ఈ సినిమాని ఎప్పుడు చూస్తామా అని నిఖిల్ అభిమానులు ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్నారు.. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ ఇంకాస్త పెండింగ్ ఉండడంతో ఇప్పటికీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుందని సమాచారం. మరి ఎప్పుడు ఈ మూవీ విడుదల కాబోతుందో ఒక్కసారి తెలుసుకుందాం..

‘స్వయంభూ’ రిలీజ్ అప్పుడేనా..? 

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పిరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ స్వయంభు.. డిఫరెంట్ స్టోరీ తో రాబోతున్న ఈ సినిమా విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. గ్రాఫిక్స్ పనులు వాయిదా పడడంతో ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది అంటూ మరో వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్లో ఉన్నట్లు టాక్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఈ ఏడాదిలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.. అన్ని పనులను త్వరగా పూర్తిచేసి అక్టోబర్ లేదా నవంబర్ చివరి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్ చేయాల్సిందే..

‘కార్తికేయ 3’ సినిమా…

Advertisement

స్వయంభు మూవీకి కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సోలోగా విడుదల చేసేందుకు అనువైన తేదీని వెతుకుతున్నారు. అక్టోబర్ నెలలో దసరా పండుగ కానుకగా రజనీకాంత్ నటించిన జైలర్ టు తో పాటుగా రణబాలి చిత్రం కూడా రిలీజ్ అవుతుంది.. మరి ఈ నెలలో సినిమాల పోటీ కాస్త ఎక్కువగా ఉండడంతో నవంబర్లో సినిమాని రిలీజ్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. నిఖిల్ ‘కార్తికేయ 2’ వంటి పాన్-ఇండియా హిట్ తర్వాత నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల ప్రక్రియ పూర్తయిన వెంటనే నిఖిల్ నెక్స్ట్ ప్రాజెక్టు లపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. వీటితో పాటుగా ది ఇండియా సినిమా కూడా చేస్తున్నట్లు టాక్.. మరి త్వరలోనే ఈ సినిమాల పై ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..

Also Read :Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. బాలు దెబ్బకు గుణ ఫ్యూజుల్ అవుట్.. చివరిలో ట్విస్ట్..

Related News

‘సర్దార్ 2’ ట్విట్టర్ రివ్యూ.. కార్తీ అకౌంట్లో హిట్ పడిందా..?

ఇరుముడి ఊచకోత.. ఇప్పటివరకు వచ్చింది ఎంతో తెలుసా ?

ఫైనల్లీ వైష్ణవి చైతన్యతో రిలేషన్ పై ఆనంద్ క్లారిటీ.. అన్న వదిననే ఫాలో అవుతున్నాడుగా?

‘సీన్ ‘గా సూర్య కొత్త సినిమా టైటిల్ .. రిలీజ్ ఎప్పుడంటే?

పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

వినాయక్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్.. 18న థియేటర్లలోకి ‘కళ్యాణం కమనీయం జీవితం’

వెంకీ సినిమా విషయంలో మరో ట్విస్ట్.. ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

Big Stories

Advertisement
×