E-Paper
Advertisement

వాట్సప్‌లో చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!

వాట్సప్‌లో చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!
Advertisement

WhatsApp Traffic Challan Scam: ఈ మధ్య మన వాట్సప్‌లో వచ్చే మెసేజ్‌లు చూసి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వస్తోంది. ఎందుకంటే.. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త పద్ధతికి తెరలేపారు. మన వాహనంపై ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉందని, వెంటనే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి డబ్బులు చెల్లించాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఈ మెసేజ్ చూసేందుకు చాలా అఫీషియల్‌గా, నిజమైన గవర్నమెంట్ నోటీసులాగే ఉంటుంది. దాంతో భయపడిపోయి చాలామంది వెంటనే ఆ లింక్ క్లిక్ చేయడం, లేదా అందులో చెప్పినట్లు APK ఫైల్ డౌన్‌లోడ్ చేయడం చేస్తున్నారు. ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది.

ఈ మోసం ఎలా జరుగుతుంది?

వాట్సప్‌లో వచ్చే ఆ మెసేజ్‌లో కేవలం లింక్ మాత్రమే కాకుండా.. ఈ-చలాన్ లేదా పరివాహన్ పేరుతో ఒక యాప్ ఇన్‌స్టాల్ చేసుకోమని చెబుతారు. ఆ యాప్ చూడటానికి అచ్చం ప్రభుత్వ యాప్‌లాగే కనిపిస్తుంది. కానీ, ఒక్కసారి మనం ఆ ఏపీకే (APK) ఫైల్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు, మన ఫోన్ మొత్తం సైబర్ కేటుగాళ్ల చేతికి చిక్కినట్టే. మన ఫోన్ డేటా, బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌లు అన్నీ వాళ్ల కంట్రోల్‌లోకి వెళ్లిపోతాయి.

మీకూ ఇలాంటి లింక్స్ వస్తే?

Advertisement

ఎప్పుడైనా మీ మొబైల్‌కు ఫైన్ పడిందని మెసేజ్ వస్తే అసలు కంగారుపడకూడదు. వాట్సప్ మెసేజ్‌లో వచ్చిన లింక్‌లను పొరపాటున కూడా టచ్ చేయవద్దు. ఒకవేళ నిజంగానే మీ బండికి చలాన్ ఉందో లేదో తెలుసుకోవాలంటే.. నేరుగా మీ మొబైల్ బ్రౌజర్‌లోకి వెళ్లి ప్రభుత్వ అధికారిక ఈ-చలాన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి మీ వాహనం నంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోండి. అప్పుడు అసలు విషయం మీకే అర్థమవుతుంది.

Also Read: యాపిల్ బిజినెస్ స్ట్రాటజీ.. iPhone 18 రాకతో పాత ఫోన్ల రేట్లను రూ.65,000 వరకు పెంచేసింది!

ఆ యాప్స్ డౌన్లోడ్ చేయొద్దు:

Advertisement

తెలియని నంబర్ల నుంచి వచ్చే వాట్సప్ మెసేజ్‌ల ఆధారంగా ఎప్పుడూ ఎలాంటి యాప్స్‌ను లేదా ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకండి. ప్రభుత్వ శాఖలు ఎప్పుడూ వాట్సప్ ద్వారా యాప్‌లను పంపించి ఫైల్ కట్టమని కోరవు. ప్రభుత్వ లొగోలు, పేర్లు ఉన్నంత మాత్రాన అవన్నీ నిజమైనవి అనుకోవడం మన పొరబాటే అవుతుంది.

పొరపాటున యాప్ ఇన్‌స్టాల్ చేస్తే?

ఒకవేళ మీరు ఇప్పటికే అలాంటి అనుమానాస్పద యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఉంటే.. వెంటనే మీ ఫోన్‌ను ఇంటర్నెట్ లేదా వైఫై నుంచి డిస్కనెక్ట్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏమైనా లీక్ అయ్యాయని అనుమానం వస్తే.. వెంటనే మీ బ్యాంకు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి మీ ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేయించుకోండి.

ఎవరికి ఫిర్యాదు చేయాలి?

ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురై డబ్బులు పోగొట్టుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించాలి. మన దేశంలో సైబర్ మోసాలపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 అందుబాటులో ఉంది. అలాగే వారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. త్వరగా స్పందిస్తే మీ డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది.

Also Read: ఇక ఏ భాషలోనైనా మాట్లాడొచ్చు.. లైవ్ ట్రాన్స్‌లేషన్, 50% ఎక్కువ ఏఎన్‌సీతో Apple AirPods 5 లాంచ్!

Tags

Related News

Vi ధమాకా ఆఫర్లు.. రూ.599, రూ. 899 కొత్త ప్లాన్లు వచ్చేశాయ్.. రోజుకి రూ.10తో అపరిమిత బెనిఫిట్స్!

రూ.630కే పోర్టబుల్ జ్యూసర్! క్షణాల్లోనే ఫ్రెష్ జ్యూస్ రెడీ

రూ.699కే అదిరిపోయే బేస్,లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌తో హెడ్‌ఫోన్స్

రూ.9,990కే..మైక్రోవేవ్ ఓవెన్!బేకింగ్,గ్రిల్లింగ్,ఎయిర్ ఫ్రైయింగ్ అన్నీ ఒకే చోట

తక్కువ నెట్‌తో హై-క్లారిటీ వీడియోస్.. యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త టెక్నాలజీ ఇదే!

రూ. 2,000లకే ఎయిర్ ప్యూరిఫైయర్.. ఐఐటీ బాంబే రీసెర్చర్ అద్భుత ఆవిష్కరణ!

ఒప్పో నుంచి మరో మాస్టర్‌పీస్.. Find X10 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి!

అదుర్స్ అనిపించే సౌండ్..డాల్బీ ఆడియోతో అరిపించే మోడల్

Big Stories

Advertisement
×