E-Paper
Advertisement

Devara 2 Update : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. దేవర వచ్చేస్తున్నాడు..!

Devara 2 Update : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. దేవర వచ్చేస్తున్నాడు..!
Advertisement

Devara 2 Update : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత చేసిన మూవీ దేవర… కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాలతో వచ్చిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం మిక్సీ్డ్ టాక్ ను అందుకోవడంతో పాటు యావరేజ్ కలెక్షన్స్ వచ్చాయి.. అయితే థియేటర్ లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టాడు. కానీ ఈ సినిమాకు సీక్వల్ గా మరో సినిమా రాబోతుందని గతంలో చాలాసార్లు వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ రూమర్స్ అని తెల్చేశారు.. ఇప్పుడు మరోసారి దేవర 2 పై వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇందులో నిజమేంత ఉందో ఒకసారి తెలుసుకుందాం..

దేవర 2 అప్డేట్..

ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో డ్రాగన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగు జరుగుతుంది. ఈ క్రమంలో దేవర 2 రాబోతుందని మరోసారి వార్తలు ఉపందుకున్నాయి. పార్ట్ 2 కోసం అభిమానులు ఎదురు చూసారు. ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి మధ్యలో కొంచెం గందరగోళం వాతావరణం కూడా నెలకొంది.. అయితే ఎవరిని గాలి వార్తలే అని తేలిపోయాయి.. కొంత కాలం గడిచాక తర్వాత దాదాపు సినిమా లేదనే టాక్ స్థిరపడిపోయింది. కానీ ఇప్పుడు తాజాగా ఈ మూవీ సీక్వెల్ పై అప్డేట్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి కొరటాల ప్రిపేర్ చేసిన వెర్షన్ తారక్ కి నచ్చినట్టే రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో మళ్ళీ ట్విస్ట్ ఇస్తూ దేవర ఆగమనం పక్కా అని టాక్.. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read :ఇమ్మూ పై బిగ్ బాస్ కుట్ర.. 10 వారాలకు నిజం బయటకు.. సంజన పై కామెంట్స్..

డ్రాగన్ మూవీ అప్డేట్.. 

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు… ఈ మూవీకి డ్రాగన్ పేరు పెట్టారు. అయితే సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ అప్డేట్స్ పెద్దగా రాలేదు.. దేవర తర్వాత తెలుగులో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్ల లో చూస్తామని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.. దీని తర్వాత తమిళ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమాలను ప్రకటిస్తాడేమో చూడాలి.. ఏది ఏమైనా ఎన్టీఆర్ లాంటి హీరోతో సినిమా చేసేందుకు బాలీవుడ్ డైరెక్టర్స్ కు ఆసక్తి కనబరుస్తున్నారు. త్వరలో మరో మూవీ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Related News

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

Big Stories

Advertisement
×