E-Paper
Advertisement

Allu Arjun: పక్కా ప్రణాళిక.. ఒక్కో జానర్ ను టచ్ చేయనున్న బన్నీ.. లైనప్ చూశారా?

Allu Arjun: పక్కా ప్రణాళిక.. ఒక్కో జానర్ ను టచ్ చేయనున్న బన్నీ.. లైనప్ చూశారా?
Advertisement

Allu Arjun:ఈ మధ్యకాలంలో హీరోలు ఒక సినిమా చేస్తుండగానే మరొకవైపు ఇతర డైరెక్టర్లు చెప్పే కథలు వింటూ.. నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ హీరోలు వరుస ప్రాజెక్టులు ప్రకటిస్తున్నారే కానీ ఆ ప్రాజెక్టుల ద్వారా మంచి సక్సెస్ అందుకుంటున్నారా అంటే చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా కథల ఎంపిక విషయంలో పట్టు ఉంటేనే భవిష్యత్తులో డిజాస్టర్ ను చవిచూడాల్సిన అవసరం ఉండదు. అందుకే హీరోలు తాము చేసే ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తూ.. ఒక్కో జానర్ ను టచ్ చేస్తూ అదిరిపోయే లైనప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

బన్నీకి ముందస్తు జాగ్రత్త ఎక్కువే..

విషయంలోకి వెళ్తే.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతరించిన అల్లు అర్జున్.. ఇప్పుడు పుష్ప2 సినిమాతో ఏకంగా భారీ పాపులారిటీ అందుకున్నారు. అంతేకాదు ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన రెండవ చిత్రంగా నిలిచింది. సుమారుగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా తర్వాత బన్నీ ఎంచుకోబోయే ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి రేకెత్తిన విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ డైరెక్టర్ కి కాకుండా ఈసారి ఏకంగా కోలీవుడ్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చి.. తన సత్తా ఏంటో చాటే ప్రయత్నం చేస్తున్నారు

గ్లోబల్ స్టార్ గా ఎదిగే ప్రయత్నం..

Advertisement

అందులో భాగంగానే తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తన 22వ మూవీని చేస్తున్నారు..ఇప్పటికే దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పైగా హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. ప్రముఖ సౌత్ బడా నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పైగా రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ALSO READ:TGIK Show Host: కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంతంటే?

ఆశ్చర్యపరుస్తున్న బన్నీ లైనప్..

Advertisement

ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరికి అవకాశం ఇవ్వనున్నారు అంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఆయన లైనప్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. అట్లీతో సినిమా తర్వాత ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టార్ డ్రామా నేపథ్యంలో ఒక సినిమా చేయనున్నారు.. ఈ చిత్రం తర్వాత తన 24వ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నారు. ఈ చిత్రం ద్వారా డివోషనల్ జానర్ ను టచ్ చేయబోతున్నారు అల్లు అర్జున్. అలాగే తన 25వ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో రా అండ్ రస్టిక్ జానర్ లో సినిమా చేయనున్నారు. అలాగే తన 26వ చిత్రం పుష్ప ఫ్రాంచైజీలో భాగంగా పుష్ప 3 : ది ర్యాంపేజ్ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇలా ఒక్కో జానర్ ను టచ్ చేస్తూ పక్కా ప్రణాళికతో గ్లోబల్ స్టార్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు అల్లు అర్జున్.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×