E-Paper
Advertisement

Sujeeth – Nani: సుజిత్ నాని సినిమా బ్లడీ రొమియో కాదా..టైటిల్ ఎంటో తెలుసా?

Sujeeth – Nani: సుజిత్ నాని సినిమా బ్లడీ రొమియో కాదా..టైటిల్ ఎంటో తెలుసా?
Advertisement

Sujeeth -Nani: నాచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు ఈయన హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్(The Paradise) అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2026 మార్చిలో విడుదల కాబోతున్నట్టు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు కానీ ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి కానీ ఇప్పటివరకు చిత్ర బృందం మాత్రం స్పందించలేదు.

గన్స్ ఎన్ రోజెస్ గా నాని సుజీత్ సినిమా..

ఇకపోతే ఈ సినిమా తర్వాత నాని తన తదుపరిచిత్రాన్ని డైరెక్టర్ సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం సుజిత్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు నాని ది ప్యారడైజ్ సినిమా పూర్తి కాగానే సుజిత్ పనులలో బిజీ కాబోతున్నారు ఇక ఈ సినిమాకు” బ్లడీ రొమియో” (Bloody Romeo)అనే టైటిల్ పెట్టారంటూ పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఇది కాదని తెలుస్తోంది. నాని సుజిత్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు “గన్స్ ఎన్ రోజెస్”(Guns N Roses) అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.

సుజిత్ సినిమాటిక్ యూనివర్స్..

Advertisement

ఇలా నాని సుజిత్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు కాస్త విభిన్నమైన టైటిల్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ సినిమాకు ఓజి సినిమాకు ఏదైనా కనెక్షన్ ఉందా? అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ టైటిల్ విషయంలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా వెల్లడించే వరకు వేచి చూడాలి. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ మరియు అనానిమస్ ప్రొడక్షన్ బ్యానర్ల మీద వెంకట్ బోయిన పల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ లో కూడా భాగం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఓజీతో హిట్ కొట్టిన సుజిత్…

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు అయితే ఈ సినిమాలో నానికి జోడిగా పూజా హెగ్డే నటించబోతున్నారని వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. మరి ఈ వార్తలన్నీ ఎంతవరకు నిజమనేది తెలియాలి అంటే అధికారికగా వెల్లడించాల్సి ఉంది. ఇటీవల డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఓజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా అనంతరం నానితో ఈ సినిమా ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Also Read: MSVPG: 500 మంది డ్యాన్సర్స్ తో చిరు ,వెంకీ పవర్ ఫుల్ సాంగ్..రంగంలోకి స్టార్ కొరియోగ్రాఫర్!

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×