E-Paper
Advertisement

Bigg Boss Buzzz: దివ్యను కడిగిపడేసిన శివాజీ.. ఒక్క మాటతో షాక్.. భరణి కోసం దివ్య కన్నీళ్లు…

Bigg Boss Buzzz: దివ్యను కడిగిపడేసిన శివాజీ.. ఒక్క మాటతో షాక్.. భరణి కోసం దివ్య కన్నీళ్లు…
Advertisement

Bigg Boss Buzzz: తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ 12 వారాలు పూర్తిచేసుకుని 13వ వారంలోకి అడుగు పెట్టింది. గతవారం అందరూ ఊహించినట్టుగానే దివ్య హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. 11వ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న ఈ అమ్ముడు 12వ వారం తప్పించుకోలేకపోయింది. హౌస్ లో తక్కువ ఓటింగ్ ని నమోదు చేసుకున్న దివ్య అనుహ్యంగా ఎలిమినేట్ అయింది.. దివ్య బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్ షో కి వచ్చింది.. సినీ నటుడు శివాజీ హోస్టుగా వ్యవహరిస్తున్నారు.. దివ్య ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని బిగ్ బాస్ తాజాగా రిలీజ్ చేశారు.. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన ప్రతి ఒక్కరికి శివాజీ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తాడు.. మరి దివ్య కు ఏ రేంజ్ లో కౌంటర్లు పడ్డాయి? శివాజీ దెబ్బకు దివ్య నిజాలు చెప్పిందా..? అనేది ఆసక్తిగా మారింది. మరి ప్రోమో ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..

తనూజ, భరణిలు ఎలా ఉంటే నీకేంటి..?

బిగ్ బాస్ బజ్ కు వచ్చిన దివ్యకు శివాజీ స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చాడు.. హౌస్ లో ఎప్పుడు స్ట్రాంగ్ నేనే అనే నువ్వు ఎందుకు కొన్ని పొరపాట్లు చేశావని శివాజీ అడిగాడు. దానికి సమాధానం చెప్పిన దివ్య నేనేమీ తప్పు చేయలేదే అని చెప్పింది. నిజంగా నువ్వేమి తప్పు చేయలేదని నువ్వు ఫీల్ అవుతున్నావా అని శివాజీ అడుగుతాడు.. తనుజ భరణి ల గురించి నీకెందుకు అసలు అని శివాజీ మొహం మీదే అడిగేస్తాడు.. వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ గా ఉంటే నీకెందుకు ఏం చేస్తే నీకెందుకు అనేసి అడగ్గానే దివ్య తెల్ల మొహం వేసేస్తుంది. నువ్వు నీ ఆట మీద మాత్రమే ఫోకస్ చేయాలి. వాళ్లిద్దరు క్లోజ్ గా ఉన్నారని కుళ్ళుకోకూడదు అంటూ ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ల మీద కౌంటర్లు వేసేశాడు శివాజీ. మొత్తానికి దివ్య ను ఒక ఆట అయితే ఆడుకున్నట్లు ప్రోమోలో కనిపిస్తుంది..

Advertisement

Also Read: డిసెంబర్ లో సినిమాల జాతర.. ‘అఖండ 2’ నుంచి ‘శంబాల’ వరకు.. డోంట్ మిస్..

నా అన్నయ్య కోసమే ఇదంతా..

బిగ్ బాస్ సీజన్ 9 లో స్ట్రాంగ్ కంటెస్టుగా ఉన్న దివ్య ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది.. ఈమె బిగ్ బాస్ బజ్ లోకి గెస్ట్ గా వచ్చింది.. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో విషయానికొస్తే.. శివాజీ అందరికీ ఎలాగైతే వెటకారంగా వెల్కం పలుకుతాడో ఈమెకు కూడా అంతే విధంగా వెల్కమ్ చెప్పాడు.. కంటెస్టెంట్ ల గురించి అడిగారు. అనంతరం తనుజ పై నీకెందుకు అంత కోపం అని ఒక్క మాటతో దివ్యను మాట్లాడనివ్వకుండా చేశాడు. అయితే హౌస్ లోకి మీ అమ్మ వచ్చినప్పుడు భరణి ఏమన్నాడో తెలుసా అని నిజాన్ని బయట పెట్టాడు. మీ అమ్మాయిని నా జోలికి రావొద్దని అన్నాడు. ఇది నీకు తెలుసా అయినా కూడా నువ్వు వాళ్ళని వదలకుండానే ఏదో ఒకటి అంటూనే ఉన్నావ్.. ఏదో ఒక రకంగా టార్గెట్ చేస్తున్నావని శివాజీ అడుగుతాడు.. అసలు ఎందుకు భరణి మీద నీకు అంత ఇది అని అడుగుతాడు. నాకు భరణి సొంత అన్నయ్య లాంటి వాడు. ఆయన టాస్కులు అన్నిట్లో బాగా ఆడాలని, బిగ్ బాస్ విన్నర్ వరకు వెళ్లాలని నాకు ఆశగా ఉండేది.. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆయన నన్ను ఎలా చూసినా సరే నేను ఆయనను నా అన్నలాగే భావించాను. బయటికి వెళ్ళిన తర్వాత నన్ను గుర్తు పెట్టుకుంటాడో లేదో కానీ ఆయన మీద ఉన్న అభిమానం మాత్రం తగ్గదు అని దివ్య కన్నీళ్లు పెట్టుకుంది. మొత్తానికి ప్రోమో అయితే బాగానే ఆకట్టుకుంటుంది. మరి ఎపిసోడ్లో దివ్య ఇంకెన్ని విషయాలను పంచుకుందో తెలియాలంటే మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Advertisement

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×