E-Paper
Advertisement

Sathya Sai district: దారుణం.. దత్తత పేరుతో తెచ్చి.. 14 ఏళ్ల బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది అత్యాచారం

Sathya Sai district: దారుణం.. దత్తత పేరుతో తెచ్చి.. 14 ఏళ్ల బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది అత్యాచారం
Advertisement

Sathya Sai district: దారుణం.. ఇప్పుడున్న కాలంలో వావి వరుస ఏమీ లేకుండా అమ్మాయి కనిపిస్తే చాలు అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇంతకు ముందు అమ్మాయిలను బయటకు పంపించాలంటే ఏవరినో ఒకరిని తోడుగా పంపించేవారు కానీ ఇప్పుడు సొంత వారిని కూడా నమ్మె పరిస్థితి లేకుండా పోయింది. అమ్మాయిలు బయటకు వెళ్లాలంటే చాలు వణికిపోతున్నారు ఏ టైంలో ఏం జరుగుతోందో అని.. ఇప్పుడు కూడా పెంచుకున్న తండ్రి, మామలు 14 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల మైనర్ బాలిక ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భం దాల్చిందని షాక్ ఇచ్చారు డాక్టర్లు. ఈ దారుణానికి ఆమె పెంపుడు తండ్రి, అతని బావమరిది అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. నెలల తరబడి మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. బాలికను బెదిరించి అత్యాచారం చేశారని ఆరోపణలు చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన బాలికకు ట్రీట్ మెంట్ చేస్తుండగా ఐదు నెలల గర్భం బయటపడింది.

Advertisement

పూర్తి వివరాల్లోకి వెళితే.. బాలికను 14 ఏళ్ల క్రితం ఈ జంట దత్తత తీసుకున్నారు. పెంపుడు తల్లిదండ్రులు ఆమెను కంటికి రెప్పలా కాపాడాల్సిన అవసరం ఉన్నప్పటికీ, తండ్రి అతని బావమరిది కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడులు కొన్ని నెలల తరబడి కొనసాగాయని ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా నిందితులు బాలికను బెదిరించి అఘాయిత్యాలకు పాల్పడ్డారని బాలిక తెలిపింది.

Also Read: గాంధీ కుటుంబానికి బిగించిన ఉచ్చు: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌పై క్రిమినల్ కుట్ర కేసు..

Advertisement

అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన బాలికకు ట్రీట్‌మెంట్ చేస్తుండగా ఐదు నెలల గర్భం బయటపడింది. ఈ షాకింగ్ విషయం తెలిసిన వెంటనే, ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్ తక్షణమే ఆసుపత్రికి చేరుకుని, బాలిక నుంచి వాంగ్మూలం సేకరించారు. ఆమె ప్రకారం, పెంపుడు తండ్రి, బావమరిది కలిసి తనపై అత్యాచారం చేశారని, తమను బెదిరించారని తెలిపింది. ఈ ఫిర్యాది ఆధారంగా, పోలీసులు ఇద్దరిపై POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికకు కౌన్సెలింగ్, మెడికల్ సహాయం అందిస్తున్నారు అధికారులు. నిందితుల అరెస్టు కోసం పోలీసులు గాలింపు తీవ్రంతరం చేశారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×