Ali Tho Allari Show: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ అనగానే అందరికీ బ్రహ్మానందం, అలీ వంటి పేర్లు ముందుగా గుర్తుకు వస్తాయి. చిన్నతనం నుంచి సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ అనంతరం కమెడియన్ గా అవకాశాలు అందుకొని కొన్ని వందల సినిమాలలో నటించి తన కామెడీ ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వారిలో అలీ (Ali)ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయన కమెడియన్ గా కొన్ని వందల సినిమాలలో నటించారు. కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా అలీ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో అలీ సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి.
ఇటీవల అలీ కేవలం కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు. అదేవిధంగా బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలీ ఇదివరకే అలీతో జాలీగా అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలను ఆహ్వానించి వారిని ప్రశ్నిస్తూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇలా సెలబ్రిటీ షో గా ఈ కార్యక్రమం చాలా మంచి సక్సెస్ అయింది.
ఇలా ఆలీతో జాలీగా అంటూ సాగిపోయిన ఈ కార్యక్రమానికి అలీ హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా అలీ మరొక కొత్త షో ప్రారంభించారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కొత్త షోకి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. ఆలీతో అల్లరి (Ali Tho Allari)కార్యక్రమం చాలా ఘనంగా ప్రారంభించామని తెలిపారు. “న్యూ షో, న్యూ వైబ్, సేమ్ అలీ.. బట్ డబుల్ ద అల్లరి ” అంటూ ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ఈ షో ద్వారా అలీ ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారని స్పష్టమవుతుంది.
?stkn=cjZ3anQybnR2bzhu
ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలను అతి త్వరలోనే తెలియజేయనున్నారు. ఇక ఇటీవల సినిమాలను కాస్త తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈయన తన భార్య జుబేదాతో కలిసి యూట్యూబ్ వీడియోలలో సందడి చేస్తున్నారు అదేవిధంగా బుల్లితెరపై ఇటీవల ప్రసారమైన కుక్ విత్ జాతి రత్నాలు సీజన్ 2 కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఆలీతో అల్లరి అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ కొత్త షో కాన్సెప్ట్ ఏంటి? ఈ కార్యక్రమం ద్వారా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.ఇక ఈ వీడియోలో అలీ వెనుక పోస్టర్స్ చూస్తుంటే మాత్రం గోడకు బాలకృష్ణ, అల్లు అర్జున్, రాజమౌళి వంటి సెలబ్రిటీల ఫోటోలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇది సెలబ్రిటీ టాక్ షో అని స్పష్టమవుతుంది.
Also Read: పిల్లలు ఉన్నా.. లేకపోయినా ఒకే అనుకున్నాం..కానీ: సమంత