Sri Satya: పండుగలు వచ్చాయి అంటే చాలు వారం రోజుల ముందే పలు టీవీ ఛానల్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సెలబ్రిటీలు పండుగ సెలబ్రేషన్స్ తో ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో మూడు రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే సెలబ్రెటీలు అంతా కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్ అంటూ మొదలు పెట్టేసారు. అందుకు సంబంధించిన షోలు ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ప్రోమోలు వదులుతూ ఆడియన్స్ లో మేకర్స్ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.
ఈ క్రమంలోనే ‘గల్లీ కా గణేష్’ ఈవెంట్ పేరిట వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 14వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో శ్రీ సత్య కి ఒక సీరియల్ హీరో, లవ్ ప్రపోజ్ చేయడమే కాకుండా ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆయన ఎవరో కాదు ప్రముఖ సీరియల్ నటుడు, బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ (Arjun Kalyan). విఘ్నేషుడి దగ్గర అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ..” విజ్ఞేశ్వర ఎలాగైనా సరే శ్రీ సత్య నా లవ్ యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ నా లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు.. ఇంకెవరి లవ్ ను ఆమె యాక్సెప్ట్ చేయకూడదు” అంటూ కోరిక కోరాడు. మధ్యలో ఆది (Hyper aadi) కల్పించుకొని.. టెంకాయ దానికి కొట్టడం కాదు నీ తలకేసి కొట్టుకో అంటూ కౌంటర్ ఇచ్చాడు. అయితే అర్జున్ కళ్యాణ్ కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోవడంతో ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నందు (Nandu ) ఒరేయ్ వీడి కోరిక కుళ్ళిపోయిందిరో అంటూ నవ్వులు పూయించారు.
అర్జున్ కళ్యాణ్ తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్న సమయంలో “ఒరేయ్ ఏంట్రా ఇది” అనే రేంజ్ లో ఎక్స్ప్రెషన్ ఇచ్చి గట్టిగా నవ్వేసింది శ్రీ సత్య. మొత్తానికైతే ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read: బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. మొత్తం ఎంతమంది? ఎవరెవరంటే ?
ఇకపోతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో వీళ్ళిద్దరూ కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. వీళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పెళ్లి కూడా చేసుకుంటారేమో అనే కామెంట్లు వ్యక్తం అయ్యాయి. అయితే అప్పుడు ఈ విషయంపై అర్జున్ కళ్యాణ్ కు ప్రశ్న ఎదురవగా ఆయన మాట్లాడుతూ..” మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు. ఏదో ఒక సాంగ్ కోసం అప్రోచ్ అయ్యారు. బేబీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అంట. ఆ తర్వాత దాని గురించి ఏం అడగలేదు. ఇక శ్రీ సత్య కు నాకు మధ్య ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. ముఖ్యంగా మా మధ్య లవ్ లేదు. ఇక బిగ్ బాస్ లో ఉండే వాళ్ళు ఏదో ఒక డ్రామా చేయాలి. ఒకరు ఎమోషనల్ గా.. ఒకరు కొట్టుకుంటూ.. ఇక మేము ఇద్దరం లవ్ డ్రామా ఆడాం.. అంతే ఇంక అంతకుమించి ఏం లేదు” అని చెప్పారు. కానీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత సడన్ గా లవ్ ప్రపోజ్ చేయడంతో రూమర్స్ నిజం చేయబోతున్నారా? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.