Jaya Krishna: ఘట్టమనేని కుటుంబానికి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఈ కుటుంబం నుంచి ఇప్పటికే మహేష్ బాబు(Mahesh Babu) స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు. అయితే త్వరలోనే ఘట్టమనేని మూడో వారసత్వం కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది ప్రముఖ దివంగత నటుడు కృష్ణ వారసుడు, దివంగత నటుడు రమేష్ బాబు(Ramesh Babu) కుమారుడు జయ కృష్ణ(Jaya Krishna)ను హీరోగా పరిచయం చేస్తూ అజయ్ భూపతి (Ajay Bhupathi)ఇటీవల సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని పోస్టర్ ద్వారా స్పష్టమవుతుంది.
ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకోబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ తెలియజేస్తూ సినిమా పట్ల అజయ్ భూపతి మంచి అంచనాలనే పెంచేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారనే విషయాలపై అధికారక ప్రకటన వెల్లడించిన సంగతి తెలిసిందే.. ప్రముఖ నటి రవీనా టాండన్(Raveen Tandon) కుమార్తె రాషా తడానీ(Rasha Thadani) హీరోయిన్ గా నటిస్తున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంగీత దర్శకుడుని కూడా పరిచయం చేశారు. జయ కృష్ణ సినిమా కోసం ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్(G.V.Prakash) రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది.
జీవి ప్రకాష్ దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన సంగీత సారధ్యంలో సుమారు వందకు పైగా సినిమాలకు పని చేశారు. అయితే అజయ్ భూపతితో ఈయన మొదటిసారి కలిసి పని చేస్తున్నారు. ఘట్టమనేని వారసుడిని హీరోగా పరిచయం చేయబోతున్న ఈ సినిమా కోసం అజయ్ భూపతి జీవి ప్రకాష్ ను రంగంలోకి దించడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఇదే విషయాన్ని జీవి ప్రకాష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ అజయ్ భూపతి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు.
Happy to join Team #AB4
Starring #JayaKrishnaGhattamaneni and #RashaThadani in an @DirAjayBhupathi film
Presented by @AshwiniDuttCh
Produced by @gemini_kiran, under the @CKPicturesoffl banner.@VyjayanthiFilms @SwapnaCinema @AnandiArtsOffl pic.twitter.com/ke9ruZsBG2— G.V.Prakash Kumar (@gvprakash) November 20, 2025
ఇక అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా అనంతరం ఈయన మహాసముద్రం,మంగళ వారం వంటి సినిమాలతో మరింత సక్సెస్ అందుకున్నారు. తాజాగా అజయ్ భూపతి తన నాలుగవ సినిమా ద్వారా జయ కృష్ణను పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పణలో జెమిని కిరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇతర నటీనటులు ఎవరు ? ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Also Read: Sonam Kapoor: రెండో ప్రెగ్నెన్సీ ప్రకటించిన స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!