E-Paper
Advertisement

Leopard in Jaipur: రాజస్థాన్ మంత్రి ఇంట్లోకి చొరబడ్డ చిరుత.. తీవ్ర భయాందోళనలో మంత్రి కుటుంబం!

Leopard in Jaipur: రాజస్థాన్ మంత్రి ఇంట్లోకి చొరబడ్డ చిరుత.. తీవ్ర భయాందోళనలో మంత్రి కుటుంబం!
Advertisement

Leopard in Jaipur: ఇటీవల జనావాసాల్లో చిరుతలు సంచరించడం సర్వసాధారణమయిపోతుంది. ఇలాంటి ఎన్నో ఘటనలకు సంబంధించిన వార్తలు చూశాం. అడవుల్లో వాటికి ఆహారం దొరక్క జనావాసాల్లోకి వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. తాజగా జైపూర్‌లోని రాజస్థాన్ జలవనరుల శాఖ మంత్రి సురేష్ సింగ్ రావత్ (Suresh Singh Rawat) నివాసంలోకి చిరుతపులి ప్రవేశించడం కలకలం రేపింది.

మంత్రి ఇంటి ఆవరణలో చిరుత అడుగుజాడలను కుటుంబ సభ్యులు గమనించారు. ఆ అడుగులు నివాసం వైపు వెళ్తుండటాన్ని చూసి అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, అందులో చిరుత ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఇది చూసి అంతా ఆందోళనకు గురయ్యారు.

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు మంత్రి ఇంటికి చేరుకుని చిరుత కోసం సెర్చ్ ఆపరేషన్ (Search Operation) చేపట్టారు. ప్రస్తుతం మంత్రి కుటుంబం క్షేమంగానే ఉంది, కానీ ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది.

చిరుతను పట్టుకున్న అధికారులు..

జైపూర్‌లోని మంత్రి సురేష్ సింగ్ రావత్ ఇంట్లోకి ప్రవేశించిన చిరుతను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత, అటవీ శాఖ సిబ్బంది చిరుతకు మత్తుమందు ఇచ్చి దానిని అదుపులోకి తీసుకున్నారు. బంధించిన చిరుతను అధికారులు ఝలానా లెపార్డ్ రిజర్వ్ (Jhalana Leopard Reserve) కు తరలించారు.

Advertisement

మంత్రి ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత, ఆ చిరుత సమీపంలోని ఒక పాఠశాల (School) ఆవరణలోకి కూడా ప్రవేశించింది. దీంతో ముందు జాగ్రత్తగా పిల్లలందరినీ క్లాస్ రూముల్లో ఉంచి తాళం వేశారు. ప్రస్తుతం చిరుత పట్టుబడటంతో ఆ ప్రాంత ప్రజలు, మంత్రి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు.

Read Also: Bandi Sanjay On Rajamouli: రాజమౌళి నిండు నూరేళ్లు బతికి మంచిగా సక్సెస్ అవ్వాలి- బండి సంజయ్

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×