E-Paper
Advertisement

Sonam Kapoor: రెండో ప్రెగ్నెన్సీ ప్రకటించిన స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!

Sonam Kapoor: రెండో ప్రెగ్నెన్సీ ప్రకటించిన స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!
Advertisement

Sonam Kapoor: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా వారికి సంబంధించిన శుభవార్తలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు తల్లితండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇలా బాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీలు అదరూ కూడా అభిమానులకు శుభవార్తలను తెలియజేస్తున్నారు. తాజాగా మరొక స్టార్ హీరోయిన్ రెండోసారి తల్లి (Second Pregnancy)కాబోతున్నాననే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ప్రెగ్నెన్సీ రివీల్ చేసిన సోనమ్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి సోనమ్ కపూర్ (Sonam Kapoor)ఇంస్టాగ్రామ్ వేదికగా తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ మరోసారి తల్లి కాబోతున్న విషయాన్ని వెల్లడించారు. దీంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పింక్ కలర్ డ్రెస్ లో బేబీ బంప్(Baby Bump) తో సోనమ్ స్టైలిష్ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈమె 2022 ఆగస్టు నెలలో మొదటి సంతానంగా మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారికి వాయు అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే.

బేబీ బంప్ ఫోటోలు..

Advertisement

ఇప్పుడు మరోసారి సోనమ్ రెండో బిడ్డకు స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా సోనమ్ సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ ఈమె అధికారికంగా తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఈమె ఐదవ నెల గర్భంతో ఉందని తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ (Anil Kapoor)కుమార్తెగా సోనమ్ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

Advertisement

సోనమ్ 2005లో సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన “బ్లాక్” చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇక 2007లో భన్సాలీ నిర్మించిన “సావరియా” చిత్రంలో ఆమె నటనా రంగ ప్రవేశం చేసింది. ఇలా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఈమె ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆనంద్ అహుజా(Anand Ahuja ) అనే వ్యక్తిని 2018 వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఈమె వృత్తిపరమైన జీవితంలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.ఇక సోనమ్ చివరిగా షోమ్ మఖిజా దర్శకత్వం వహించిన 2023 క్రైమ్ థ్రిల్లర్ “బ్లైండ్” సినిమాలో కనిపించి సందడి చేశారు.

Also Read: Varanasi: వారణాసి నుంచి మరో సర్ ప్రైజ్.. ‘ రణ కుంభ’ ఆడియో సాంగ్ రిలీజ్!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×