E-Paper
Advertisement

Xiaomi HyperOS 3: మరింత కొత్తగా షావోమీ HyperOS 3 అప్ డేట్, ఏకంగాAI ఫీచర్లతో!

Xiaomi HyperOS 3: మరింత కొత్తగా షావోమీ HyperOS 3 అప్ డేట్, ఏకంగాAI ఫీచర్లతో!
Advertisement

Xiaomi’s HyperOS 3 Update: షావోమీ భారత్ లో Android 16-ఆధారిత HyperOS 3 అప్‌ డేట్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. విడుదల తేదీ ఇంకా కన్ఫార్మ్ కాకపోయినా, దేశవ్యాప్తంగా వినియోగదారులలో బలమైన అంచనాను సృష్టించింది.  Xiaomi, Redmi, Poco స్మార్ట్‌ ఫోన్ వినియోగదారులు ఈ అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.  HyperOS 3 ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉన్నందున,  భారత్ లో మెరుగైన పనితీరు, కొత్త AI ఫీచర్లతో వినియోగదారుల ముందుకు రానున్నట్లు భావిస్తున్నారు.

త్వరలో ఇండియాలోకి Xiaomi HyperOS 3!

త్వరలో ఇండియాలో Xiaomi HyperOS 3 వస్తుందని కంపెనీ టీజ్ చేసింది.Xiaomi పోస్టులో Android 16-ఆధారిత Xiaomi HyperOS 3 త్వరలో భారతదేశానికి వస్తుందని ధృవీకరించింది. Xiaomi, Redmi, Poco స్మార్ట్‌ ఫోన్లకు ఈ అప్‌డేట్ అందుతుందని భావిస్తున్నారు. అయితే, వేటికి అందుబాటలో ఉంటుదనే Xiaomi ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ సమాచారం త్వరలో ప్రకటించబడుతుందని భావిస్తున్నారు.

చైనాలో సెప్టెంబర్‌ లో అందుబాటులోకి వచ్చిన HyperOS 3

Advertisement

Xiaom మొదట సెప్టెంబర్‌ లో చైనాలో HyperOS 3ని ప్రవేశపెట్టింది. ఇది Android 16 ఆధారంగా రూపొందించబడింది. ఫ్లాగ్‌షిప్ Xiaomi 17 సిరీస్ సాఫ్ట్‌ వేర్ ప్రీ ఇన్‌ స్టాల్ చేయబడిన మొదటి ఫోన్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి.  ఇందులో అదనంగా హైపర్‌ ఐలాండ్ ఫీచర్ ను కలిగి ఉంది. ఇది ఛార్జింగ్ వేగాన్ని పెంచుతుంది. కొత్త డ్యూయల్ ఐలాండ్ లే అవుట్ వినియోగదారులు వారి ప్రస్తుత స్క్రీన్‌ ను ఛేంజ్ చేయకుండా ఇతర పనులు చేసేలా అనుమతిస్తుంది. ఇది ఆడియో రికార్డింగ్ లను చేసే అవకాశం కల్పిస్తుంది. డిస్ ప్లే పైభాగంలో మ్యూజిక్ కంట్రోల్స్, కాల్స్ ఇన్ఫర్మేష్, షెడ్యూల్స్ ను యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది.

AI ఫీచర్లతో HyperOS 3  

HyperOS 3లో స్మార్ట్ స్క్రీన్ గుర్తింపు, డీప్‌ థింక్ మోడ్ లాంటి AI  టూల్స్ తో కూడిన HyperAI మరిన్ని ఫీచర్లను కలిగి ఉండబోతోంది. అద్భుతమైన రైటింగ్ ఫీచర్లు, AI స్పీచ్ రికగ్నిషన్, ఆడియో క్వాలిటీ పెరుగుదల, రియల్ టైమ్ ట్రాన్స్‌ క్రిప్షన్‌ లను కలిగి ఉంటుంది. AI సెర్చ్ డివైజ్ కంటెంట్‌ ను స్కాన్ చేస్తుంది. గ్యాలరీ చిత్రాలను 10 వర్గాలుగా విభజించి, గుర్తించడంలో ఈజీగా సాయపడుతుంది. ఈ అప్ డేట్ AI డైనమిక్ వాల్‌ పేపర్లు, AI సినిమాటిక్ లాక్ స్క్రీన్, రిఫ్రెష్ చేయబడిన హోమ్ స్క్రీన్ డిజైన్‌ను కూడా అందిస్తుంది.

అక్టోబర్ నుంచి అప్ డేట్ విడుదల

Advertisement

Xiaomi అక్టోబర్‌ లో అప్‌డేట్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. Xiaomi 15T Pro, Xiaomi 15T, వాచ్ S4 (41mm),  స్మార్ట్ బ్యాండ్ 10 ఇప్పటికే సాఫ్ట్‌ వేర్‌ తో ప్రీ ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. అక్టోబర్, నవంబర్ నాటికి, Xiaomi 15 సిరీస్, మిక్స్ ఫ్లిప్, Redmi Note 14 సిరీస్, Poco F7, Poco X7 సిరీస్, Pad Mini, Pad Mini 7ని అప్ డేట్ అందుకోవడానికి షెడ్యూల్ చేయబడ్డాయి. నవంబర్, డిసెంబర్ నాటికి, అప్ డేట్ Xiaomi 14 సిరీస్, Redmi Note 13 Pro, Redmi 15, Redmi 14C లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. Xiaomi 13 సిరీస్, Redmi Pad Pro 5G లాంటి పాత డివైజ్ లకు మార్చి 2026 నాటికి HyperOS 3ని అందుకోవడానికి ప్లాన్ చేశారు.

Read Also:  30 డేస్ వ్యాలిడిటీతో.. చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×