E-Paper
Advertisement

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!
Advertisement

Khushi Kapoor:ఖుషీ కపూర్..శ్రీదేవి చిన్న కూతురైన ఈ బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఖుషీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తనదైన స్టైల్, ఫ్యాషన్ తో యూత్ మంచి క్రేజ్ సంపాదించుకున్న చేసిన సినిమాలు తక్కువైనా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా కనిపిస్తుంది.

ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన వెకేషన్ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట మంటలు పెడుతున్నాయి.

Advertisement

మాములుగా సినిమాలు, షూటింగులు, ప్రమోషన్లతో బిజీగా గడిపే సినీ సెలబ్రిటీలు కాస్త సమయం దొరికితే చాలు.. ఇలా వెకేషన్స్ కి వెళ్లి రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడుతుంటారన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే ఖుషీ కపూర్ కూడా మాల్దీవుల్లోని మాల్దీవుల్లోని జేడబ్ల్యూ మారియట్ కాఫు అటోల్ రిసార్ట్‌ లో చుట్టూ బ్లూ కలర్ సముద్రం, ఆకాశంలో మేఘాలు, మధ్యలో విలాసవంతమైన రిసార్ట్‌లోతన వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఆమె షేర్ చేసిన ఫొటో చూస్తే అర్థమవుతోంది.

ముఖ్యంగా ఈ ఫొటోలో ఖుషీ కపూర్ పింక్ కలర్ బికినీలో,సన్‌గ్లాసెస్ పెట్టుకుని తన స్టైలిష్ లుక్‌తో ఆడియన్స్ ని ఫిదా చేస్తుంది. ఇక ఆమె ముందు ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తోందనే చెప్పాలి. రకరకాల ఫుడ్ ఐటమ్స్‌ ఈ ఫొటోని మరింత కలర్ ఫుల్ గా మార్చేశాయి.

Advertisement

ఇక ఈ ఫొటోలను ఖుషీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. “No place I’d rather be” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే, ఇంతకంటే ఇష్టమైన ప్రదేశం మరొకటి లేదన్నమాట. మొత్తంగా తన వెకేషన్‌ను ఎంతగా ఎంజాయ్ చేస్తుందో ఈ పోస్ట్‌లో చెప్పేసింది ఖుషీ.ఇక ఖుషీ కపూర్ ఫొటోలు అలా వచ్చాయో లేదో వెంటనే అభిమానులు ఆమె లుక్‌ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు . సాధారణంగా సినిమా ఈవెంట్లు, ఫ్యాషన్ ఫొటోషూట్లలో కనిపించే ఈ అమ్మడు.. ఇలా వెకేషన్ మూడ్‌లో కనిపించడం అభిమానులకు ఐ ఫీస్ట్ అనే చెప్పాలి.

ఖుషీ కపూర్ 2023లో విడుదలైన ‘ది ఆర్చీస్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ స్టార్ కిడ్. జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాగా ఇందులో బెట్టీ కూపర్ అనే పాత్రలో కనిపించి అలరించింది ఖుషీ.ఇక ఇందులో సుహానా ఖాన్, అగస్త్య నందా వంటి యువ నటులు కూడా ఈ సినిమాలో పార్ట్ అవ్వడం విశేషం.

ఇక ఆ తర్వాత 2025లో ‘లవ్యాపా’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఖుషీ.అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీలో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి నటించడం విశేషం. ఇక ఇదే ఏడాది ‘నదానియాన్’ సినిమాతోనూ ఖుషీ ప్రేక్షకులను పలకరించింది.ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాకి షౌనా గౌతమ్ దర్శకత్వం వహించారు.
రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. చూడాలి మరి సోషల్ మీడియా లో తన అంద చందాలని ఒలకబోస్తూ సందడి చేస్తున్న ఈ భామ కెరీర్ లో ఎప్పుడు వేగం పెంచుతుందో !

ALSO READ :విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

Tags

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

Big Stories

Advertisement
×