HBD Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకి యూత్ ఎంతగా కనెక్ట్ అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ట్రెండ్ ఎప్పుడు ఫాలో అవ్వని పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ట్రెండ్ని సెట్ చేసినట్టే ఫ్యాన్స్ మనసుని కూడా సెట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ తన మేనరిజంతో మనసు దోచుకున్నాడు.. ప్రతిరోజు పవన్ కళ్యాణ్ ఏదో ఒక విధంగా జనాలని ఆకట్టుకుంటూనే వస్తున్నాడు. ఒకప్పుడు కేవలం సినీ నటుడుగా మాత్రమే జనాలకు పరిచయం.. ఈ మధ్య ఏపీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఒక ప్రజల మనిషిగా రాజకీయవేత్తగా అందరిని తన ప్రవర్తనతో దగ్గరయ్యేలా చేస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ స్టైల్ మేనరిజం కి యూత్ ఫిదా అయిపోతుంటారు.. ఆ పేరు వినగానే ఒక రకమైన పూనకాలు మొదలవుతాయని యూత్ చెబుతూ ఉంటారు.. ఒక్క మాటలో చెప్పాలంటే యువతకి పవన్ కళ్యాణ్ ఒక దేవుడనే చెప్పాలి. ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్న పవన్ కళ్యాణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు, అలాగే కుటుంబ సభ్యులు ఇక అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతూ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ చేసిన ఆ ఒక్కటే జనాల్లో అందరికి బాగా నచ్చుతుంది.. అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే యువతకి ఒక పండగ వాతావరణం అని చెప్పాలి. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన నటుడికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలను చేసేందుకు రెడీ అవుతున్నారు.. పవర్ స్టార్ ని ఈ స్థాయిలో నిలబెట్టింది మాత్రం ఒక్కటే అని చెప్పాలి.. సినిమాలు హిట్ అయినా.. ఫ్లాప్ అయినా కూడా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఒకటే సినిమాలకు మంచి స్థాయిని తీసుకొని వచ్చింది.. మొన్నటివరకు సినిమాల్లో హీరోగా ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనాల్లో జనం మెచ్చిన నాయకుడిగా అందరిని మనసుని దోచుకున్నాడు.. ఆయన మంచితనమే ప్రజలను ఉపముఖ్యమంత్రిగా ఎన్నుకునేలా చేసింది.. మంచి మనస్తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు..ప్రస్తుతం సినిమాలను ఎక్కువగా చెయ్యడం లేదు. కానీ ఫ్యాన్ బేస్ మాత్రం తగ్గలేదు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచాల అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయమైన అతను.. ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం వంటి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా తొలిప్రేమ, తమ్ముడు, బద్రి వంటి హిట్ సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాలు నిరాశపరిచినా కూడా మరికొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి.. కొన్ని సినిమాలు మంచి కలెక్షన్స్ ని కూడా అందుకున్నాయి. ఇటీవల కాలంలో ఆయన నటించిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారా అన్న ఆసక్తి కూడా పెరిగింది.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కమిటీ అయిన సినిమాలను పూర్తి చేశారు.. ఇటీవల ఆయన నటించిన సినిమాలలో హరిహర వీరమల్లు నిరాశపరిచింది. ఓజీ బాగా ఆకట్టుకుంది. అటు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పర్వాలేదు అనే టాక్ ను సొంతం చేసుకుంది. ఇకమీదట పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలోనే ఓజీ ను సినిమాలో నటించే అవకాశం ఉందని సమాచారం. ఇవాళ ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్..
Also Read : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!