E-Paper
Advertisement

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ
Advertisement

Hyderabad city: తెలంగాణలో రాజకీయాలు క్రమంగా వేడెక్కాయి. అధికార-విపక్షాల మధ్య మాటలేకాదు, చివరకు ఏఐని విస్తారంగా వాడుకుంటున్నాయి పార్టీలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. సోషల్ మీడియా వేదికగా జరిగే రచ్చ కాన్త, రోడ్లపైకి తీసుకొచ్చాయి కొన్ని పార్టీలు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. దీని వెనుక ఆ పార్టీయే కారణమని అంటున్నారు అధికార పార్టీ నేతలు.

 

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తోంది. దీంతో 1000 రోజుల పాలన పేరుతో వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. పలువురు మంత్రులు తమ శాఖలు చేసిన పని గురించి వివరిస్తున్నారు. దీన్ని గమనించిన ప్రత్యర్థి పార్టీ నేతలు, అధికార పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేయాలని భావించారు. అందుకు అనుగుణంగా కొత్త స్కెచ్ వేశారు. ఐఏతో తయారు చేసిన పోస్టర్లు హైదరాబాద్ సిటీలోని ఫైఓవర్ పిల్లర్లపై అంటించారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా

Advertisement

అధికార కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల పాలనను తీవ్రంగా విమర్శించారు. ఈ తరహా పోస్టర్లు హైదరాబాద్‌ సిటీలోని కీలక ప్రాంతాల్లో కనిపించడం తీవ్ర కలకలం రేపాయి. 1000 డేస్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనే పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ వాటిని అతికించారు. సిటీలో అత్యంత రద్దీగా ఉండే అసెంబ్లీ, సచివాలయం, ట్యాంక్ బండ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ పరిసరాలు, జూబ్లీహిల్స్, బేగంపేట, మెట్రో పిల్లర్లు, ఫ్లైఓవర్లు పిల్లర్లకు వీటిని అంటించారు. చివరకు గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో ఈ తరహా పోస్టర్లు ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

ALSO READ: బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

TGSMS పేరుతో ఏఐ చిత్రాలను వ్యంగ్యంగా రూపొందించారు. ఓ వైపు భారీ సంచిని మోసుకెళ్తున్నట్లు, మరోవైపు ప్రజలు ఆవేదనతో సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా చూపించారు. సిటీలో అర్ధరాత్రి వెలిసిన పోస్టర్లపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. వీటిని ఎవరు ముద్రించారు? వాటిని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించే పనిలో పడ్డారు. సోషల్ మీడియా మధ్య జరుగుతున్న రచ్చ కాస్త, నలుగురు తిరిగే రోడ్లపైకి తీసుకొచ్చారంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటీవల కేసీఆర్‌కు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారని, దాన్ని తిప్పి కొట్టేందుకు ఈ విధంగా వేశారని అనుకుంటున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Tags

Related News

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

Big Stories

Advertisement
×