E-Paper
Advertisement

HHVM Day 2 Collections :  ‘వీరమల్లు’ వీరకుమ్ముడు.. రెండో రోజు వసూళ్ల జోరు.. ఎన్ని కోట్లంటే..?

HHVM Day 2 Collections :  ‘వీరమల్లు’ వీరకుమ్ముడు.. రెండో రోజు వసూళ్ల జోరు.. ఎన్ని కోట్లంటే..?
Advertisement

HHVM Day 1 Collections : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలై 24 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఐదేళ్లుగా సెట్స్ మీదనే ఉన్న ఈ మూవీ ఇన్నాళ్లకు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. పవన్ కళ్యాణ్‌ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే బుధవారం రాత్రే ప్రీమియర్ షోలు ప్రదర్శించగా, టిక్కెట్ రేట్లు పెరిగినప్పటికీ మంచి స్పందన లభించింది. మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులిపేస్తుంది. రెండు రోజులకు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో తెలుసుకుందాం..

‘హరిహర వీరమల్లు’ సెకండ్ డే కలెక్షన్స్..

Advertisement

ఈ సినిమాకు సంబంధించిన ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ సినిమాకు సుమారుగా 12 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో 5 కోట్లకుపైగా వసూళ్లు నమోదు అయ్యాయి. 7 కోట్లకుపైగా ఆంధ్రాలో రాబట్టింది. అటు ఓవర్సీస్ లో కూడా భారీగానే వసూల్ చేసిందని టాక్. దాదాపుగా 700 k అంటే 6 కోట్లు వసూల్ చేసిందని టాక్.. మొత్తం అన్ని ఏరియాల్లో భారీగానే వసూల్ అయ్యాయని సమాచారం.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. 76 కోట్లు వసూల్ చేసిందని తెలుస్తుంది. మరి రెండో రోజు ఎన్ని కోట్లు వసూల్ చేసిందన్న విషయం పై మేకర్స్ క్లారిటీ ఇవాల్సి ఉంది. వీకెండ్ కావడంతో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని టాక్.. ఆదివారానికి 200 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు ఉన్నాయని టాక్..

Also Read :ఎన్నో కష్టాలు.. వరంగల్ గల్లీ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు ఎదిగిన రచ్చ రవి జర్నీ..

Advertisement

మూవీ బడ్జెట్ & బిజినెస్ వివరాలు.. 

పవన్ కళ్యాణ్, బ్యూటిఫుల్ నిధి అగర్వాల్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు.. ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏం ఏం కీరవాణి సంగీతాన్ని అందించారు. జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయానైజాంలోళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్క్రీన్లలో రిలీజైంది.. వరల్డ్ టాప్ టెక్నీషియన్లు కూడా పనిచేయడం విశేషం. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ ఖర్చులన్నీ కలుపుకొని ఈ చిత్రానికి రూ.250 కోట్లు వ్యయం అయ్యిందని టాక్. అలాగే తొలిసారిగా పవన్ కళ్యాణ్ నుంచి పాన్ ఇండియా మూవీ రిలీజ్ కాబోతుండటంతో సినిమాకు భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రానికి ఇండియాలో రూ.117 కోట్ల బిజినెస్, ఓవర్సీస్ లో మరో 10 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ.127 కోట్ల బిజినెస్ జరిగిందని  సమాచారం.. 52 కోట్లు ఫస్ట్ డే వసూల్ అయ్యాయి.. సెకండ్ 76 కోట్లు వసూల్ అయ్యాయి. ఈ వీకెండ్ లోనే 150 కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ పంతుల్లు అంచనా వేస్తున్నారు.. అంతకు మించి వసూల్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×