Racha Ravi : సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నటీనటులు పుట్టుకతోనే ఎవరూ గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదు. జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి సినిమాల్లో అవకాశాలు అందుకొని ఒక్కో సినిమాతో తమ టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజెను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి ఒకరు. ఈయన గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక్కో సినిమాలో అవకాశాన్ని అందుకుంటూ ఇప్పుడు స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. జులై 27న రచ్చ రవి పుట్టినరోజు సందర్భంగా ఆయన మూవీ జర్నీ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం.
రచ్చ రవి గురించి ఆసక్తికర విషయాలు..
తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా, టివి నటుడు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన రవి, 2013లో వచ్చిన ‘వెయ్యి అబద్ధాలు’ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. హన్మకొండలోని విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, ఎస్.వి.ఎస్. జూనియర్ కళాశాలో ఇంటర్మీడియట్ చదివాడు. కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేశాడు. అయితే చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆస్తకి ఉండడడంతో సినిమారంగంలోకి వెళ్ళి తన ప్రతిభను నిరూపించుకోవాలనుకున్నాడు. దూరదర్శన్‌లో వచ్చిన చార్లీచాప్లిన్ ఎపిసోడ్స్ చూసేవాడు. వినాయక చవితి మంటపాల్లో ప్రదర్శించే హరికథలు, బుర్రకథలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఇష్టం పెంచుకున్నాడు. మిమిక్రీ నేర్చుకొని అనేక స్టేజీల మీద ప్రదర్శనలిచ్చాడు.
‘వన్స్‌మోర్ ప్లీజ్’ షోతో ఎంట్రీ..
హైదరాబాద్ కు వచ్చిన రవి అనేక టీవీ షోలల్లో అవకాశాల కోసం వెతికాడు. జెమిని టీవీ లో వన్స్‌మోర్ ప్లీజ్’ కార్యక్రమంతో తొలిసారిగా టివిలో ప్రదర్శన ఇచ్చాడు. ఈ సమయంలో సినిమాల్లో ప్రయత్నించి సరైన అవకాశాలు రాకపోవడంతో వరంగల్‌కు వెళ్ళిపోయాడు. అక్కడ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్‌లో ఉద్యోగం చేరాడు. ఆ తర్వాత దుబాయ్ కు వెళ్లి అక్కడ రెడీయో జాకీగా పనిచేసాడు. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్ కు వచ్చేసాడు.. జబర్దస్త్ లో అవకాశాన్ని సంపాదించుకున్నాడు. అలా వరంగల్ గల్లీ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు ఒక్కో మెట్టు ఎదుగుతూ సక్సెస్ అయ్యాడు.
Also Read:శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు స్పెషల్..
రచ్చ రవి సినిమాలు..
దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన ‘వెయ్యి అబద్ధాలు’ సినిమాలోని నటనతో సినిమారంగంలోకి ప్రవేశించాడు. తొలిరోజుల్లో చిన్నచిన్న పాత్రల్లో కాసేపు కనిపించిన స్థాయి నుండి కథలో ప్రాధాన్యమున్న ఉండే పాత్రల్ని పోషించే స్థాయికి చేరుకున్నాడు.‘గద్దలకొండ గణేష్’, ‘శతమానంభవతి’ చిత్రాల్లో తెలంగాణ, ఆంధ్రా యాసలో మాట్లాడి అలరించాడు.. ఇప్పటివరకు ఆయన 80 సినిమాల వరకు నటించాడు. ఎన్నో అవార్డులను అందుకున్నాడు. వరంగల్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన జర్నీ సాగింది. ఇండస్ట్రీలో టాప్ కమెడియన్గా కొనసాగుతున్న వారిలో రచ్చ రవి ఒకరు. ఇలాంటి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాం..