BigTV English

Jamie Lever: ఆడిషన్ అని చెప్పి బట్టలు విప్పమన్నాడు.. స్టార్ కమెడియన్ కూతురు సంచలన వ్యాఖ్యలు

Jamie Lever: ఆడిషన్ అని చెప్పి బట్టలు విప్పమన్నాడు.. స్టార్ కమెడియన్ కూతురు సంచలన వ్యాఖ్యలు

Jamie Lever: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొని నటి లేదు అంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోయిన్స్ నుంచి ఇప్పుడు పరిచయమవుతున్న హీరోయిన్ల వరకు ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు క్యాస్టింగ్ కౌచ్ బారిన పడుతూనే ఉన్నారు. అవకాశాలు ఇప్పిస్తామని లైంగిక వేధింపులకు గురిచేస్తూ ఇబ్బంది పెడుతున్న వారు ఉంటూనే ఉన్నారు. ఈ కాస్టింగ్ కౌచ్ పై ఇండస్ట్రీ ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా కూడా ఎక్కడో ఒకచోట ఇప్పటికీ జరుగుతూనే ఉంది.


 

స్టార్స్ గా మారిన తర్వాత వారు తాము పడిన ఇబ్బందులను మీడియా ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఇది కేవలం కొత్తగా వచ్చేవారి పైనే కాదు స్టార్ వారసులకు కూడా వర్తిస్తుంది. వెనుక బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా కొంతమంది వారసురాళ్లను ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురిచేసినట్లు చాలామంది చెప్పుకొచ్చారు. తాజాగా బాలీవుడ్ స్టార్ కమెడియన్ జానీ లివర్ కుమార్తె జామీ లివర్ సైతం తాను క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


 

జామీ లివర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తండ్రిలాగానే  కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించి స్టార్ కమెడియన్ గా మారింది. తెలుగులో కూడా జామీ ఒక సినిమాలో నటించింది. అల్లరి నరేష్ ఫరియ అబ్దుల్లా జంటగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నరేష్ క వదినగా కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తున్న జామీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను చెప్పుకొచ్చింది.

 

స్టార్ వారసురాలిగా కెరీర్ ను మొదలుపెట్టిన నేను మొదట్లో ఎలాంటి మేనేజర్స్ ను పెట్టుకోలేదు.  ఏ అడిషన్ కైనా నా ఫోన్ నెంబర్ ఇచ్చేదాన్ని. నా మెయిల్ కు వచ్చిన ప్రతి ఆడిషన్ను పూర్తి చేసేదాన్ని.  అలా ఒక రోజు ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్టుకు ఎంపిక చేయడానికి ఆడిషన్ చేస్తున్నానని ఒక వ్యక్తి నాకు వీడియో కాల్ చేశాడు. అప్పటివరకు ఆడిషన్స్ ఇలా చేస్తారని నాకు తెలియదు. సరే కథని ఇంకా ఎక్కువగా అర్థమయ్యేలా చెప్పడానికి వీడియో కాల్ చేశాడేమో అని అనుకొని మాట్లాడాను. ఎదురుగా స్క్రీన్ లో ఎవరు కనిపించలేదు. తన కెమెరాను ఆఫ్ చేసి సదురు వ్యక్తి కథను చెప్పడం మొదలుపెట్టాడు.

 

మధ్యలో ఆ పాత్రకు నేను సరిపోతానో లేదో అని టెస్ట్ చేయాలన్నాడు. నీ ఎదురుగా ఒక 50 ఏళ్ల వ్యక్తి ఉన్నాడనుకో అతనితో నువ్వు చాలా రొమాంటిక్ గా  మాట్లాడాలి అంటూ బట్టలు విప్పమన్నాడు. సడన్ గా నేను షాక్ అయ్యి నాకు ఇలాంటివి సౌకర్యంగా లేవు. నేను చెయ్యను అన్నాను. దానికి అతను ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని, కామెడీ రోల్ తో పాటు బోల్డ్ గా కనిపిస్తానని అందుకే అలా చేయమన్నానని చెప్పాడు.  ఒకవేళ బోల్డ్ క్యారెక్టర్ అయితే అందుకు తగ్గ సీన్స్ నేను షూటింగ్లో చేస్తానని, ఇప్పుడు చేయనని చెప్పాను. అయినా అతను వినిపించుకోకుండా బట్టలు విప్పమని చెప్పాడు. వెంటనే నాకు సౌకర్యంగా లేదు అని కాల్ కట్ చేశాను. ఇది నాకు కొత్తగా అనిపించింది ఇండస్ట్రీలో నా తండ్రి ఉండడం నా అదృష్టంగా భావించాను. స్టార్ పిల్లలమైన మాకే ఇలా ఉంటే కొత్తగా వచ్చే అమ్మాయిల పరిస్థితి ఏంటో అని అప్పుడు నాకు భయమేసింది” అంటూ జామీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి

Related News

OG Tickets : ఆంధ్రాలో ఓజి బుకింగ్స్ ఓపెన్, ఊచకోత మొదలైంది. తెలంగాణలో అప్పుడే

Deepika Padukone: దీపికా ఎక్కడా? నువ్వు స్పందించే టైం వచ్చింది..

Mirai – Kishkindhapuri : కలెక్షన్స్‌లో మిరాయ్‌ ని దాటేసిన కిష్కంధపురి.. ఇదెక్కడి ట్విస్ట్ అసలు

Kalki 2 Movie : దీపికను తప్పించడానికి కారణాలు ఇవే… 30 కోట్లు ప్లస్ టీంకు ఖర్చులు.. ఇంకా మరెన్నో

Malayalam Actress: మోహన్‌ లాల్‌పై సీనియర్‌ నటి సంచలన కామెంట్స్‌.. నా భర్త చనిపోతే.. స్వార్థ బుద్ధితో..

Deepika Padukone : తీసేస్తే తీశారు కానీ… కెరీర్‌‌పై గట్టి దెబ్బ కొట్టారు

Deepika Padukone: అయ్యో దీపికా.. టాలీవుడ్‌లో ఒకే ఒక్కడు సపోర్ట్… అయినా డ్యామేజ్ జరిగిపోయింది

Deepika Padukone: శభాష్ తెలుగు ప్రొడ్యూసర్స్.. దీపికా ఇష్యూపై నెటిజన్స్ మాటలు ఇవి

Big Stories

×