Renu Desai: తెలుగు నటిగా, మోడల్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచి పేరు సొంతం చేసుకుంది రేణు దేశాయ్ (Renu Desai). 2000 సంవత్సరంలో పార్థీబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘జేమ్స్ పాండు’ అనే చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ‘బద్రి’ సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు జోడిగా నటించింది. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, సహజీవనం చేశారు. ఒక కొడుకుకి జన్మనిచ్చిన తర్వాత 2009 జనవరి 28న పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూతురు పుట్టింది. ఇక 2012లో విడాకులు తీసుకొని విడిపోయారు. దాంతో పిల్లల్ని తీసుకొని ముంబైకి వెళ్లిపోయిన రేణూ దేశాయ్ అక్కడే సెటిలైపోయింది. ఒకవైపు జంతు ప్రేమికురాలిగా.. జంతు సంరక్షకురాలుగా కొనసాగుతూనే.. మరొకవైపు పిల్లల బాధ్యతను చక్కగా నెరవేరుస్తోంది.
అలాంటి మూర్ఖులపై కఠిన చర్యలు తీసుకోవాలి – రేణూ దేశాయ్
అంతేకాదు అప్పుడప్పుడు సమాజంలో జరిగే పలు అంశాలపై కూడా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా మతాలు, నమ్మకాలను అవమానించడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ ఒక రేంజ్ లో మండిపడింది. అంతేకాదు ఇలాంటి మూర్ఖులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇలాంటి వారికి కచ్చితంగా బుద్ధి చెప్పాలని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే రేణు దేశాయ్ ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి అసలు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలేమైందంటే?
అసలు విషయంలోకి వెళ్తే.. ఈమధ్య ఇస్కాన్ కు సంబంధించిన రెస్టారెంట్ కి ఒక బ్రిటీష్ వ్లాగర్ వెళ్లారు. అక్కడ వెజ్ మాత్రమే దొరుకుతుందని తెలిసినా కూడా అతడు కేఎఫ్సీచికెన్ ఉందా అని అడిగారట. అలాంటివి ఇక్కడ దొరకవు అని అక్కడ వర్కర్స్ చాలా వినయంగా చెప్పారు. కానీ హఠాత్తుగా బ్యాగ్ లో నుంచి కేఎఫ్సీ చికెన్ తీసి అక్కడే తినడం మొదలుపెట్టాడు ఆ వ్లాగర్. అక్కడ పనిచేసే వర్కర్స్ ఇక్కడ నాన్ వెజ్ నిషిద్ధమని, దయచేసి ఇక్కడ ఇలాంటివి తినకూడదు అని ఎంత వారించినా.. అతడు మాత్రం వినలేదు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సదరు వ్లాగర్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేణూ దేశాయ్ కి అండగా నెటిజన్స్..
ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలని, ఇతర మతాలకు గౌరవం ఇవ్వడం తప్పనిసరి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ వీడియో కాస్త రేణు దేశాయ్ వరకు వెళ్లడంతో ఆమె దీనిపై తనదైన శైలిలో మండిపడుతూ కౌంటర్ ఇచ్చింది. ఒక ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. పలువురు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. అంతేకాదు ఆ వ్లాగర్ పై తగిన చర్యలు తీసుకోవాలని కూడా కామెంట్ పెడుతున్నారు.
ALSO READ:War 2: వార్ 2లో అలియా భట్.. ఇదెక్కడి ట్విస్ట్.. ఆ పోస్ట్ కి అర్థం అదేనా?