E-Paper
Advertisement

హరికృష్ణ 70వ జయంతి..ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!

హరికృష్ణ 70వ జయంతి..ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Jr NTR:స్వర్గీయ నందమూరి హరికృష్ణ (Harikrishna ) 70వ జయంతి నేడు. ఈ సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా పంచుకున్న ఈ భావోద్వేగ పోస్ట్ నందమూరి అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. మరి ఎన్టీఆర్ తన పోస్టులో ఏం పంచుకున్నారో ఇప్పుడు చూద్దాం.

తండ్రి జయంతి.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్..

ఎన్టీఆర్ తన తండ్రిని స్మరించుకుంటూ.. “ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే” అంటూ తన తండ్రికి నివాళులర్పించారు ముఖ్యంగా తన అన్నయ్య కళ్యాణ్ రామ్ (Kalyan Ram) పేరు , తన పేరు వచ్చేలా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి..

Advertisement

నందమూరి హరికృష్ణ 1956 సెప్టెంబర్ 2న జన్మించగా.. 2018 ఆగస్టు 29న రోడ్డు ప్రమాదంలో మరణించారు. సరిగ్గా తన పుట్టినరోజుకు నాలుగు రోజుల ముందే ఆయన మరణించడం అభిమానులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఆయన మరణించి ఇన్నేళ్లు అవుతున్నా.. ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు అభిమానులలో మెదులుతూనే ఉంటాయి.

హరికృష్ణ సినిమా కెరియర్..

1956 సెప్టెంబర్ 2న నిమ్మకూరు గ్రామంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు , బసవ తారకం దంపతులకు నాలుగవ కుమారుడిగా జన్మించారు. 11మంది తోబుట్టువులు కలిగిన ఈయనకు ఏడుగురు సోదరులు, నలుగురు సోదరీమణులు. 1964లో శ్రీ కృష్ణావతారం చిత్రంలో బాలనటుడిగా అరంగేట్రం చేసిన ఆయన.. ఇందులో శ్రీకృష్ణుడి పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. తాతమ్మ కల, రామ్ రహీం, దానవీరశూరకర్ణ వంటి చిత్రాలలో నటించిన ఈయన సుదీర్ఘ విరామం, రాజకీయ ప్రస్థానం తర్వాత శ్రీరాములయ్య , నాగార్జున తో సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య వంటి చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటుడి గానే కాకుండా నిర్మాతగా , రాజకీయ నాయకులుగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మరణించడం ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement

also read:“ప్రజలు మెచ్చిన నాయకుడు”.. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్!

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు..

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్థాయిలో పేరు సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.

కళ్యాణ్ రామ్ సినిమాలు..

కళ్యాణ్ రామ్ విషయానికొస్తే ఒకవైపు హీరోగా, మరొకవైపు నిర్మాతగా పలు చిత్రాలు చేస్తూ బిజీగా మారారు. ప్రస్తుతం ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వం లో జనవరి 12న విడుదల అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మరి కళ్యాణ్ రామ్, వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ మల్టీ స్టారర్ వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

Big Stories

Advertisement
×