E-Paper
Advertisement

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..
Advertisement

Stock Market: బాంబే స్టాక్‌మార్కెట్ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బుధవారం ప్రారంభంలో సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 1 శాతం పైగా పతనమైంది. మార్కెట్ పతనం వెనుక రకరకాల కారణాలు వ్యక్తముతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో భారీ మార్పు వంటివి చోటు చేసుకున్నాయి. ఫలితంగా నిమిషాల వ్యవధిలో మదుపరుల సంపద దాదాపు 5 లక్షల కోట్లు ఆవిరైంది.

 

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌

Advertisement

బుధవారం ఉదయం 9.16 గంటలకు బాంబే స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 750 పాయింట్లు, నిఫ్టీ 235 పాయింట్లు పతనమయైంది. ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో విదేశీ మదుపరులు అమ్మకాలకు పాల్పడ్డారు. దీనికారణంగా మార్కెట్ బలహీనపడింది, నిఫ్టీ మిడ్‌క్యాప్-100 అయితే 1.22 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్-100 అయితే ఒక శాతం పడిపోయింది. అదే సమయంలో ఇండియా విక్స్ కంపెనీ షేర్లు 2.84 శాతం పెరిగింది.

 

నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి!

Advertisement

మదుపరులు అమ్మకాలకు కారణం అమెరికా-ఇరాన్ మధ్య తాజా ఉద్రిక్తతలే. ఇరాన్ లక్ష్యాలపై అమెరికా దాడులు, దానికి ప్రతిస్పందనగా ఇరాన్ దాడులు తీవ్రతరం చేసింది. ఈ సంఘర్షణ కాలంగా మధ్యప్రాచ్యం నుండి ఇంధన సరఫరాలకు ముప్పు వాటిల్లవచ్చనే ఆందోళనలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను అమ్మకాలకు పాల్పడ్డారు. ఫలితంగా ఆసియా మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో జపాన్- నిక్కీ, దక్షిణ కొరియా-కోస్పి 2.2 శాతం, 3 శాతం మేరా పతనమైంది.

 

ఆసియా మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి

యుద్ధ భయాలు నేరుగా చమురు మార్కెట్‌ను తాకడంతో బ్రెంట్ క్రూడ్ రేటు ఒకే రాత్రిలో దాదాపు 5 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్‌ ధర 96 డాలర్ల వద్దకు చేరుకుంది. భారత్ చమురు అవసరాల్లో దాదాపు 85 నుంచి 90 శాతం దిగుమతులపై ఆధారపడింది. ఆయిల్ ధర పెరిగితే ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందని భావించారు మదుపరులు. దీనికితోడు అంతర్జాతీయ బాండ్ ఈల్డ్స్ భారీగా పెరగడం ఈక్విటీ మార్కెట్లను కుదిపేసింది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.82 శాతానికి చేరడం కూడా మరో కారణం.

ALSO READ: గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

జనవరి 2025 తర్వాత అత్యధిక స్థాయి ఇదే. బాండ్ల రాబడి పెరిగితే మదుపరులు స్టాక్‌మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించి ప్రభుత్వ బాండ్ల వైపు మొగ్గు చూపుతారు.  అమెరికాలో బాండ్ ఈల్డ్స్ పెరగడం పెద్ద ముప్పుగా మారింది. 10 ఏళ్ల ఈల్డ్ 5 శాతాన్ని తాకితే.. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలో భారీ కరెక్షన్ జరిగే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాలు దేశీయంగా కాకుండ ఆసియామార్కెట్లను ఓ కుదుపు కుదిపేసింది.

Related News

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

కొత్త ఉద్యోగంలో చేరారా? మీ PF ఖాతాలో ఈ 5 వివరాలు తప్పనిసరిగా చూడండి

Big Stories

Advertisement
×