E-Paper
Advertisement

BSNL CNAP Feature: BSNL సరికొత్త ఫీచర్.. Unknown కాల్స్.. ఎవరు చేశారో ఇట్టే తెలిసిపోద్ది!

BSNL CNAP Feature: BSNL సరికొత్త ఫీచర్.. Unknown కాల్స్.. ఎవరు చేశారో ఇట్టే తెలిసిపోద్ది!
Advertisement

BSNL CNAP Feature: ప్రస్తుత రోజుల్లో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి పెద్దఎత్తున కాల్స్ పెరిగిపోతున్నాయి. వ్యాపార ప్రకటనలు, పొలిటికల్ సర్వేలు, సైబర్ కాల్స్ ఇలా రకరకాల కాల్స్.. మెుబైల్ యూజర్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్ ఎత్తకుండానే కాల్ ఎవరు చేస్తున్నారో తెలుసుకునే CNAP (కాలర్ నేమ్ ప్రజెంటేషన్) ఫీచర్‌ను టెలికాం కంపెనీలు తీసుకొస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) చొరవతో ఇప్పటికే ఎయిర్ టెల్, జియో, వీఐ వంటి టెలికాం సంస్థలు వీటిని అమల్లోకి తీసుకొచ్చాయి. తాజాగా బీఎస్ఎన్ఎల్ సైతం CNAP ఫీచర్ ను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది.

అసలేంటి CNAP ఫీచర్?

సాధారణంగా Truecaller వంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇతరుల కాంటాక్ట్ లిస్టుల ద్వారా పేర్లను సేకరిస్తాయి. కానీ, ఈ కొత్త CNAP సిస్టమ్ ద్వారా KYC (Know Your Customer) రికార్డుల ఆధారంగా పేరు కనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు ప్రభుత్వానికి సమర్పించిన అసలు పేరు మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనివల్ల తప్పుడు పేర్లతో మోసం చేసే అవకాశం ఉండదు.

ఇక యాప్‌తో పనిలేదు..

Advertisement

ఫోన్ చేసే వ్యక్తి పేరు.. నేరుగా టెలికాం నెట్‌వర్క్ డేటాబేస్ నుండి వస్తుంది కాబట్టి ఎలాంటి మోసాలకు అవకాశం ఉండదు. కాబట్టి Unknown కాల్స్ గురించి తెలుసుకునేందుకు ఇక థర్డ్ పార్టీ యాప్ లను ఆశ్రయించాల్సిన అవసరం బీఎస్ఎన్ఎల్ యూజర్కు ఉండదు. పైగా ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. CNAP పొందేందుకు ఎలాంటి ఇంటర్నేట్ సౌకర్యం కూడా అవసరం లేదు. మారమూల ప్రాంతాల వారు సైతం CNAP ఫీచర్ను ఉపయోగించుకోవచ్చు. పైగా దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలను టెలికాం సంస్థలకు చెల్లించాల్సిన అవసరం లేదు.

Also Read: Dishwashers Under Rs 25,000: తక్కువ బడ్జెట్‌లో.. అద్భుతమైన కదిలే డిష్ వాషర్లు.. మిడిల్ క్లాస్‌కు పండుగే!

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

Advertisement

ప్రస్తుతం BSNL ఈ టెక్నాలజీని C-DoT సహకారంతో వివిధ జోన్లలో పరీక్షిస్తోంది. రాబోయే 3-4 నెలల్లో దేశవ్యాప్తంగా CNAP సేవలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు BSNLకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. C-DoT ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ట్రయల్స్ ప్రారంభించిందని.. 4G, 5G నెట్ వర్క్ పై వీటిని పరీక్షిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ CNAP ఫీచర్.. స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Also Read: Sony Bravia 8 II OLED: ఓరి దేవుడా.. సూపర్ క్లాస్ సోనీ టీవీపై.. ఎగిరిగంతేసే డిస్కౌంట్!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×