E-Paper
Advertisement

Kissik Talks: ప్రతి నెలా రూ. 50 లక్షల గోల్డ్ కొంటా.. వర్కర్స్‌కి శాలరీ ఎంత ఇస్తానంటే – మాధురి

Kissik Talks: ప్రతి నెలా రూ. 50 లక్షల గోల్డ్ కొంటా.. వర్కర్స్‌కి శాలరీ ఎంత ఇస్తానంటే – మాధురి
Advertisement

Kissik Talks: ప్రతి నెలా రూ. 50 లక్షల గోల్డ్ కొంటానని అన్నారు ఫైర్ బ్రాండ్ దువ్వాడ మాధురి (Duvvada Madhuri). తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తన ఆస్తుల వివరాలను తెలపాలని కోరగా, ‘అది చెప్పను కానీ, ప్రతి నెలా మా దగ్గర పని చేసే వర్కర్స్ శాలరీలకే రూ. 25 లక్షలు ఇస్తాము’ అని చెప్పుకొచ్చారు. ఇదంతా దేవుడు ఇచ్చిందేనని, ఫైనాన్షియల్‌గా బాగా ఉన్నత కుటుంబమని మాధురి తెలిపారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో..

Also Read- Duvvada Madhuri: ప్రపంచంతోనే ఫైట్ చేశా.. చాలా బాధగా ఉండేది!

ప్రతి నెలా రూ. 50 లక్షలకు గోల్డ్

Advertisement

‘‘మా ఆస్తి వివరాలు చెప్పను కానీ, ప్రతి నెలా వర్కర్స్‌కు రూ. 25 లక్షలు శాలరీ కింద ఇస్తాను. ఆస్తి ఎంత అంటే చెప్పలేను. దేవుడు ఇచ్చినంత అని మాత్రమే చెప్పగలను. నాకు గోల్డ్ అంటే ఇప్పటికీ చాలా ఇష్టం. మా ఆయన (దువ్వాడ శ్రీనివాస్) నాకు గోల్డ్ కొనుక్కోమని.. రోజూ లక్ష రూపాయలు ఇస్తారు. మంత్లీ అది దాచిపెట్టి, ప్రతి నెలా రూ. 50 లక్షలకు గోల్డ్ కొనుక్కుంటాను. నేను మొదటి నుంచి ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గానే ఉన్నాను. పెట్రోల్ బంక్స్ రన్ చేశాను, రియల్ ఎస్టేట్ చేశాను. తర్వాత పాలిటిక్స్‌లోకి వచ్చాను. పాలిటిక్స్‌లోకి వచ్చిన తర్వాత ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ క్రియేట్ అయ్యాయి. రాజకీయాల వల్ల మైనింగ్, పోర్ట్ బిల్లుల రూపంలో సుమారు రూ. 50 కోట్ల వరకు నష్టపోయాము’’ అని మాధురి ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read- Vijay Rashmika: విజయ్ రష్మిక ‘బడ్డీమూన్’ విల్లా ఒక్క రాత్రికి రెంట్ ఎంతో తెలిస్తే మతిపోతుంది!

ఎక్కడా క్షమాపణలు చెప్పలేదు

Advertisement

తిరుపతి ఇష్యూపై స్పందిస్తూ.. ‘‘తనూజ (Tanuja) బర్త్‌డే ఆ రోజు. అందరినీ వదిలి వచ్చింది కదా అని, నేనే కేక్ తీసుకెళ్లి కట్ చేయించడం జరిగింది. దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేశారు. అందరూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నేను మాత్రం ఎక్కడా క్షమాపణలు చెప్పలేదు. అలాంటి వీడియోలు కూడా పోస్ట్ చేయలేదు. అసలు అలా వీడియోలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు’’ అని చెప్పుకొచ్చారు. తనూజ, దువ్వాడ మాధురి మధ్య ఉన్న బాండింగ్ ఏంటనేది బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చూసిన వారికి తెలియంది కాదు. వారిద్దరూ హౌస్‌లో ఒకటే మాట మీద ఉండేవారు. తనూజ తల్లిలా మాధురి అన్ని చేస్తుంటే వారు. మాధురి ఎలిమినేటై వెళ్లే సమయంలో కూడా.. బయటకు వచ్చిన తర్వాత కలుసుకుందామంటూ ఆప్యాయంగా చెప్పుకున్నారు. సీజన్ ముగిసినా, వారి మధ్య బాండింగ్ నడుస్తుందనే దానికి తిరుపతి ఘటనే సాక్ష్యం. కాకపోతే, అదే ఆమెను వార్తల్లో ట్రోల్ అయ్యేలా చేసింది.

Also Read- Niharika: చరణ్‌కు యాక్సిడెంట్ అని చెప్పగానే షాకైన నిహారిక.. వీడియో వైరల్!

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×