E-Paper
Advertisement

Ustaad Bhagath Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆ ఎలివేషన్ సీన్ తీసేసిన హరీష్.. ఉంది ఉంటే ఫలితం వేరుగా ఉండేదా..?

Ustaad Bhagath Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆ ఎలివేషన్ సీన్ తీసేసిన హరీష్.. ఉంది ఉంటే ఫలితం వేరుగా ఉండేదా..?
Advertisement

Ustaad Bhagath Singh:ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలైన దగ్గర నుంచి ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది అభిమానులు సినిమాలో ఉన్న మాస్ సీన్స్‌ను ఆస్వాదిస్తే, మరికొందరు మాత్రం ఆశించిన స్థాయిలో సినిమా లేదని భావిస్తున్నారు. ముఖ్యంగా సినిమా రిలీజ్‌కు ముందు చెప్పిన కొన్ని హైలైట్ సీన్స్ సినిమాలో కనిపించకపోవడం అభిమానులను నిరాశపరిచింది.

సినిమా ప్రమోషన్ సమయంలో దర్శకుడు హరీష్ శంకర్.. నిర్మాతలు ఈ మూవీ గురించి భారీగా మాట్లాడారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయని చెప్పారు. ఆ మాటలతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. కానీ సినిమా చూసిన తర్వాత, కొన్ని చెప్పిన సన్నివేశాలు అందులో లేకపోవడం చర్చకు దారి తీసింది.

ఆ సీన్ ఉంది ఉంటే..!

Advertisement

ఒక సినిమా ఈవెంట్‌లో, హీరో-డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని తన కోరికను వ్యక్తం చేశారు. అప్పుడే ఆయన ఒక ఆసక్తికరమైన సీన్ గురించి చెప్పాడు. పవన్ కల్యాణ్ ఒక కారు మీద కూర్చుని ట్రావెల్ చేసే సీన్ తాను చేయాలని అనుకుంటున్నానని అన్నారు. దీనికి స్పందించిన హరీష్ శంకర్, అలాంటి సీన్ ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో తాను తీసేశానని చెప్పారు.

ఈ మాటలతో ఆ సీన్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి పెరిగింది. అయితే సినిమా విడుదలయ్యాక చూసినప్పుడు, ఆ సీన్ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్‌లో అసంతృప్తి మరింత పెరిగింది. ఒకవేళ ఆ సీన్ సినిమాలో ఉండి ఉంటే, ఫ్యాన్స్‌కు మరింత కనెక్ట్ అయ్యేదని చాలామంది భావిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది ఒకవేళ ఈ సీన్ తీసి ఆ తర్వాత సినిమా నుంచి తీసేసారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగా ఆ సీన్ ఉంటే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది అని కూడా కొంతమంది అభిమానులు..అభిప్రాయపడుతున్నారు.

Advertisement

ఇంకా, సినిమా గురించి ముందుగా చెప్పిన హైప్ కూడా ప్రేక్షకుల అంచనాలను పెంచింది. కానీ ఫైనల్‌గా వచ్చిన ఫలితం మాత్రం ఆ స్థాయికి చేరుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తం పైన ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో చెప్పినదానికి చూపినది తేడాగా ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: Prabhas: ఇండియాలో కాకుండా.‌. ఆ దేశంలో ఆస్తులు కొనుక్కుంటున్న రెబల్ స్టార్..!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×