E-Paper
Advertisement

Harish Shankar: ‘భవదీయుడు’ కాస్త ‘ఉస్తాద్’ ఎలా అయ్యాడు? హరీష్ స్పందనిదే..

Harish Shankar: ‘భవదీయుడు’ కాస్త ‘ఉస్తాద్’ ఎలా అయ్యాడు? హరీష్ స్పందనిదే..

Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘గబ్బర్ సింగ్’. ఆ సినిమా సృష్టించిన మ్యాజిక్ మరోసారి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)తో రిపీట్ చేయాలని ఫ్యాన్స్ ఎంతకానో కోరుకుంటున్నారు. ఎన్నో వార్తల అనంతరం, ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 26న ఈ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ మేరకు ఆయన మీడియా వారికి ఇచ్చిన రౌండ్ టేబుల్ సమావేశంలో.. ఈ సినిమాకు మొదట ప్రకటించిన చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’ టైటిల్‌ని అనూహ్యంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా మార్చడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ…

Also Read- Peddi Song: ‘పెద్ది’ సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ఎందుకు ‘భవదీయుడు’ వద్దనుకున్నారంటే.

‘‘నేను ఎంత పెద్ద ఫ్యానో అందరికీ తెలుసు. ‘గబ్బర్ సింగ్‌’ అనే మాస్ సినిమా చేశా. ఎక్కడో అర్బన్ తాలుకూ అవుట్ ఫిట్స్, ఆయన వేసుకునే హుడీస్ వంటివన్నీ గబ్బర్‌ సింగ్ లో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. అక్కడక్కడ పాటల్లో చూపించినా సినిమా అంతా దాదాపు 80 శాతం పోలీస్ గెటప్‌లోనే అందులో కనిపిస్తారు. ఈసారి పోలీస్ డ్రస్ కాకుండా, ఆ క్యారెక్టర్‌కు మించిన ఎనర్జీని ఇవ్వాలని ప్లాన్ చేస్తూ, ఈసారి కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో కథ అనుకున్నాం. అలా వర్క్ చేస్తున్న సమయంలో సోషల్ మీడియాలో అంతా ‘గబ్బర్ సింగ్’ అంటున్నారు. ఈ సినిమాకు ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ పెడితే.. ‘అన్నా.. భవదీయుడు అంటే ఏంటి?’ అని జెన్-జీ (Gen-Z) నన్ను క్వశ్చన్ చేశారు. అది నన్ను బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది. అసలు టైటిలే అర్థం కాకపోతే ఎలా? అని అని అనుకున్నా. వాళ్లకి ఏం చెప్పాలో అర్థం కాలేదు.

Also Read- Lavanya Tripathi: చిరంజీవి పై ట్రోలింగ్ అందుకే రియాక్ట్ అయ్యాను..లావణ్య క్లారిటీ

స్ట్రాంగ్ క్యారెక్టర్ కోసం ట్రై చేయడంతో..

పవర్‌స్టార్‌కి ఆ టైటిల్ బాగా నచ్చింది. భవదీయుడు అంటే వినయం, భగత్ సింగ్ అంటే విస్ఫోటనం.. వినయం ప్లస్ విస్ఫోటనం.. కాంబినేషన్ అదిరిపోయిందని అన్నారు. ఆ రెండు బాగా సెట్ అయ్యాయని అనుకుని, టైటిల్ అనౌన్స్ చేశాం. వాస్తవానికి మేం ప్రకటించలేదు.. కొందరు లీక్ చేశారు. కానీ సినిమా మొదలు పెట్టినప్పుడు జనాలు ఇంకా మాస్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని అర్థమైంది. మాస్ నెంబర్, విలన్‌తో డైలాగ్స్.. ఇవన్నీ ఆ కాలేజ్ బ్రాక్‌డ్రాప్ కథలో సరిపోవడం లేదు. ఈ లోపు ఆయన వేరే సినిమాలు కూడా సైన్ చేశారు. సరే సార్.. ఇంకా స్ట్రాంగ్ క్యారెక్టర్ తీసుకుందామని చెప్పా. ‘గబ్బర్ సింగ్ యూనివర్స్’ లాగా మళ్లీ పవర్ ఫుల్ కాప్ స్టోరీనే రెడీ చేశాం. ఆ టైమ్‌లో చాలా చెప్పాలని అనుకున్నాం. లెంగ్త్ వల్ల అవన్నీ చేయలేకపోయాం. చాలా రోజులు అయ్యింది కదా.. మళ్లీ చేద్దాం అనే యాంగిల్‌లో అప్పుడు కాప్ పాత్రలో స్టార్ట్ చేశాం’’ అని చెప్పుకొచ్చారు. అలా పసివాడు పవన్ కళ్యాణ్ అయినట్లుగా.. ‘భవదీయుడు’ కాస్త ‘ఉస్తాద్’ అయ్యాడన్నమాట.

Also Read- Mahesh Babu :మహేష్ బాబు వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాల లిస్ట్ ఇదే..!

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×