E-Paper
Advertisement

Siddipet Crime: బతుకుదెరువు కోసం వస్తే.. మృత్యువు ఒడిలోకి.. ముగ్గురు వలస కూలీల మృతి

Siddipet Crime: బతుకుదెరువు కోసం వస్తే.. మృత్యువు ఒడిలోకి.. ముగ్గురు వలస కూలీల మృతి
Advertisement

Siddipet Crime:  సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో తీరని విషాదం నెలకొంది. బతుకుదెరువు కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వలస కూలీలను మృత్యువు కబళించింది. కస్తూరిపల్లి గ్రామంలో ఉన్న చెక్ డ్యామ్‌లో పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

బీహార్ రాష్ట్రం నుంచి రెండు కుటుంబాలు ఐదు రోజుల క్రితమే ఉపాధి కోసం కస్తూరిపల్లికి వచ్చాయి. సాయంత్రం స్నానం చేసేందుకు 12 ఏళ్ల కిరణ్ కుమార్, 6 ఏళ్ల బిర్జు చెక్ డ్యామ్ వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటి లోతు ఎక్కువగా ఉన్న చోట పడి ఇద్దరు గల్లంతయ్యారు. గమనించిన ఉమా దేవి .. ఆ చిన్నారులను కాపాడే క్రమంలో తాను కూడా నీటిలో దిగి గల్లంతయ్యింది.

Advertisement

స్థానికులు వెంటనే స్పందించి గాలింపు చేపట్టినప్పటికీ అప్పటికే ముగ్గురు మృతి చెందారు. మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల కిందటే వచ్చిన వారు ఇలా విగతజీవులుగా మారడంతో వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి వారిని కలచివేస్తున్నాయి. మృతుల్లో ఉమా దేవి, ఆమె కుమారుడు కిరణ్ ఉండటంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది.

ALSO READ: Iran: అగ్నిగుండంలా ఇరాన్.. ఖమేనీ పని ఖతం.. !

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×