E-Paper
Advertisement

Harish Shankar: ‘ఉస్తాద్’లాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు.. ఎందుకు అంటున్నానంటే?

Harish Shankar: ‘ఉస్తాద్’లాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు.. ఎందుకు అంటున్నానంటే?
Advertisement

Harish Shankar: ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఉగాది కానుగా మార్చి 19వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Also Read- Harish shankar: ఉస్తాద్ భగత్ కోసం శ్రీలీల త్యాగం.. వడ్డీతో సహా తిరిగిస్తాం: హరీష్ శంకర్

ఆ విషయం నేను చెప్పలేను

Advertisement

‘‘చాలా రోజుల తర్వాత మీడియాను ఇలా కలవడం సంతోషంగా ఉంది. ఈ ఉగాది ‘ఉస్తాద్ ఉగాది’ కాబోతుంది. ఒక బిగ్ స్టార్ హీరో నుంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ వచ్చి చాలా కాలమైందనేది నా అభిప్రాయం. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, సాధారణ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసేలా స్టార్ హీరో నుంచి అన్ని హంగులతో వచ్చిన సినిమా ఈ మధ్య కాలంలో లేదని నా ఫీలింగ్. పాటలు, డ్యాన్స్, డైలాగులు, ప్రేమ, హాస్యం, విలన్‌తో పవర్ ఫుల్ సీన్స్.. ఇలా అన్ని అంశాలు ‘ఉస్తాద్’లో ఉంటాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందనేది నేను చెప్పలేను కానీ, ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది, ఇంత ఎంటర్‌టైనింగ్ సినిమా వచ్చి చాలా కాలమైందని మాత్రం చెప్పగలను. హెయిర్ స్టైల్ నుంచి డ్యాన్స్, డైలాగ్స్, హాస్యం.. ఇలా పవర్ స్టార్ నుంచి కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉండి.. పూర్తిస్థాయి పవన్ కళ్యాణ్ సినిమా చూశామనే సంతృప్తిని ఇస్తుంది ఉస్తాద్.

Also Read- Tilak Varma: ‘పెద్ది’ సెట్స్‌కు తిలక్ వర్మ.. రామ్ చరణ్ ఏం చేశారో చూశారా!

మళ్ళీ మళ్ళీ చూస్తారు

Advertisement

ఈ సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేసి, మంచి అవుట్ పుట్ ఇచ్చాము. పక్కా ప్లానింగ్‌తో సమయాన్ని, డబ్బుని వృధా చేయకుండా ఈ సినిమా పూర్తి చేశాం. అలా చేయగలగడానికి ప్రధాన బలం మాత్రం పవర్ స్టారే. ప్రజా పాలన, పరిపాలనా పరమైన అంశాలకు ఇబ్బంది కలగకుండా మాకు సమయం ఇచ్చేవాళ్ళు. ఫలానా సమయానికి రాగలనని, ఇంత సమయం కేటాయించగలనని ముందుగానే మాకు సమాచారం ఇచ్చేవారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వంటి నిర్మాతలను కాపాడుకోవడం నాలాంటి ప్రతి దర్శకుడి బాధ్యత. వీళ్ళు మరిన్ని సినిమాలు తీస్తూ, పది కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా ఆలస్యమైనా, ఒక్కసారి కూడా ఎప్పుడూ అసహనం ప్రదర్శించలేదు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. నేను అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చారు. వారిచ్చిన మద్దతు వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. అలాగే చివరి నిమిషంలో హీరోలా వచ్చి, నేపథ్య సంగీతం బాధ్యత తీసుకున్న తమన్‌కు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. ఇలాంటి పూర్తిస్థాయి ఎంటర్‌టైనింగ్ సినిమా చూసి కాలమైందని చూసిన ప్రతి ఒక్కరూ కనీసం పది మందికి చెబుతారు. ఇక ఫ్యాన్స్ అయితే మళ్ళీ మళ్ళీ చూస్తారు’’ అని హరీష్ శంకర్ ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.

Also Read- Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో సినిమా.. పేరెంట్స్ తో ఫైట్ చేసిన రష్మిక.. ఏం జరిగిందంటే?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×