Tilak Varma: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తన 16వ చిత్రం ‘పెద్ది’ (Peddi) షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌లోకి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్, తెలుగు వాడు, యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. షూటింగ్ లోకేషన్‌కు వచ్చిన తిలక్ వర్మకు రామ్ చరణ్ అండ్ టీమ్ సాదరంగా స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి సరదాగా ముచ్చటిస్తూ, సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను మానిటర్‌లో వీక్షించారు. సెట్స్‌లో తిలక్ వర్మ రాకతో చిత్ర యూనిట్ అంతా సందడి సందడిగా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేసిన బుచ్చిబాబు.. ‘‘టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ ‘పెద్ది’ సెట్స్‌ను సందర్శించారు. సినిమాలోని ఒక స్పోర్ట్స్ సీక్వెన్స్ చూసి ఆయన ఎంతగానో ఇంప్రెస్ అయ్యారు’’ అని ట్వీట్ చేశారు.
Also Read- Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో సినిమా.. పేరెంట్స్ తో ఫైట్ చేసిన రష్మిక.. ఏం జరిగిందంటే?
బుచ్చిబాబు షేర్ చేసిన ఈ వీడియోలో.. రామ్ చరణ్ తిలక్ వర్మను ప్రత్యేకంగా అభినందించారు. దేశం గర్వించేలా వరల్డ్ కప్ గెలిచినందుకు గాను తిలక్ వర్మకు చరణ్ ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. ‘పెద్ది’ సినిమా కాన్సెప్ట్‌కు తగ్గట్టుగా, పురాతన శైలిలో డిజైన్ చేసిన ఒక బ్యాట్‌ను తిలక్ వర్మకు రామ్ చరణ్ బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఆ బ్యాట్ మీద చరణ్ తన ఆటోగ్రాఫ్‌ను కూడా ఇచ్చారు. ఈ గిఫ్ట్ చూసిన తిలక్ వర్మ చాలా ఎగ్జైట్ అవ్వడమే కాకుండా, చరణ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వరల్డ్ కప్ గెలిచిన సమయంలో చరణ్ తన షూటింగ్‌ను ఆపివేసి మరీ సెలబ్రేషన్స్ చేశారని, క్రాకర్స్ కాల్చారని తెలుసుకున్న తిలక్ వర్మ చాలా సంతోషం వ్యక్తం చేశారు.
Also Read- Aditya Dhar: రిలీజ్‌కు ముందు ‘ధురంధర్ 2’ దర్శకుడు ఎమోషనల్.. అంచనాలతో మాత్రం వెళ్లకండి..
ఈ సందర్భంగా తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘‘థాంక్యూ చరణ్ అన్న.. మీ టైమ్ ఇచ్చి నన్ను ఇలా అభినందించడం చాలా గొప్పగా అనిపిస్తోంది. మీ సినిమాలన్నీ నేను ఫస్ట్ డే చూస్తాను, ‘పెద్ది’ కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని తిలక్ వర్మ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక సెట్‌లో వీరిద్దరినీ ఇలా చూసిన వారంతా ఈలలు, గోలలతో హోరెత్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 30 ఏప్రిల్, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సినిమాను శరవేగంగా పూర్తి చేయడానికి బుచ్చిబాబు అండ్ టీమ్ తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
T20 World Cup champion @TilakV9 visited the sets of #Peddi ❤🔥
He caught a glimpse of the film’s sports sequences and was thoroughly impressed.#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/D5i8u7cTpg
— BuchiBabuSana (@BuchiBabuSana) March 18, 2026
Also Read- Rajashekar: చిరు, వెంకీలకు ‘లైఫ్’ ఇచ్చిన యాంగ్రీ యంగ్ మ్యాన్